Breaking News

స్లోవేకియా నాయకుడు రిచర్డ్‌ 'థేకువా స్వీట్'రుచి‌కి ఫిదా!

Published on Wed, 07/15/2026 - 13:59

ప్రధాని నరేంద్ర మోదీ తన స్లోవేకియా పర్యటన సందర్భంగా ఆ దేశ జాతీయ మండలి ఛైర్మన్ రిచర్డ్ రాసికి థేకువాను గిప్ట్‌గా ఇచ్చారు. ఆ తర్వాతా ఆ నాయకుడు ఆ మిఠాయి పెట్టలోని థేకువా స్వీట్‌ని రుచి చూసిన వీడియోని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆ నేపథ్యంలో ఆ మిఠాయి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆ వీడియోలో ప్రధాని మోదీ నుంచి తాను అందుకున్న ఈ సాంప్రదాయ మిఠాయిల పెట్టేను తన ఫాలోవర్లకు చూపించారు. 

ఆ సంప్రదాయ చెక్‌పెట్టెను తెరుస్తూ..ఇలాంటి బహుమతులు ఇవ్వాలన్న ఆలోచనే అత్యద్భుతమని కొనియాడారు. ఇది సాధారణ దౌత్య బహుమతులకు అతీతమైనదని అన్నారు. ఆ స్వీట్‌ని బిస్కెట్లతో పోలుస్తూ.థేకువా రుచి చూశారు. అంతేగాదు ఆ స్వీట్‌ రుచికి ఫిదా అయ్యారు కూడా. మరి ఈ సందర్భంగా ఆ స్వీట్‌ తయారీ, ఏ ప్రాంతాల వారు ఎక్కువగా ఆస్వాదిస్తారు వంటి విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

ఇది బయట కరకరలాడుతూ, లోపల కొద్దిగా మెత్తగా, పొడిపొడిగా ఉంటుంది. ఈ తీపి వంటకానికి 'థోక్నా' అనే హిందీ పదం నుంచి ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు పాకశాస్త్ర నిపుణులు. 

థేకువా అంటే ..
థేకువా (Thఆkuwa) అనేది భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్,  నేపాల్ ప్రాంతాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ తియ్యటి బిస్కెట్ లేదా వంటకం. దీనిని ముఖ్యంగా ఛత్ పూజ (Chhath Puja) వంటి పవిత్రమైన పండుగలలో నైవేద్యంగా తయారు చేస్తారు. దీన్ని ప్రధానంగా గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, సోంపు గింజలు, యాలకులు , కొబ్బరి తురుముతో తయారు చేస్తారు. కావాలనుకుంటే తరిగిన డ్రైఫ్రూట్స్‌ను కూడా కలుపుతారు. 

తయారీ విధానం..
ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, సోంపు గింజలు, తురిమిన కొబ్బరి, యాలకుల పొడిని కలపాలి. ఆ తర్వాత నెయ్యిని పోసి కలపాలి. పిండిని ముద్దగా అయ్యేంత వరకు నెయ్యి వేసి కలపాలి. ఆ తర్వాత బెల్లాన్ని నీటిలో కరిగించి పాకంలా కాకుండా జస్ట్‌ బెల్లం కరిగేంత వరకు మరిగించాలి.  ఆతర్వాత ఆ బెల్లం నీళ్లు వేస్తూ..నిరంతర కలుపుతూ  చపాతీ పిండిలా చేసుకోవాలి. 

ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని బిస్కెట్ల మాదిరిగా చేతులతో ఒత్తాలి. కావాలనుకుంటే ఫోర్క్‌ లేదా ఏదైన డిజైన్‌ని రూపొందించుకోవచ్చు. అలా అన్నింటిని చేయాలి. అలాగే ఆ పిండి ముద్దలు ఆరిపోకుండా బట్ట కప్పాలి. ఆ తర్వాత వాటిని నూనెలో డీప్‌ఫ్రై చేస్తే సరి. అంతే ఎంతో రుచికరమైన థేకువా రెడీ. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి మరి. ముఖ్యంగా వర్షాకాలం, శీతకాలం సాయంత్రం సమయంలో టీ తాగుతూ వీటిని తింటుంటారు.

 

(చదవండి: ఆరోగ్యం క్షీణిస్తున్నా..నిరాహార దీక్షలోనే సోనమ్‌! అన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే..)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)