ఈ సబ్బు క్యాన్సర్‌కు ఆన్సర్‌!

Published on Sun, 08/31/2025 - 08:25

అందం కోసం వాడే సబ్బును ఒక బాలుడు క్యాన్సర్‌ వ్యాధి మీద ప్రయోగించే ఆయుధంగా మార్చాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని, ఇది నిజం. అమెరికాకు చెందిన పదిహేనేళ్ల హీమన్‌  బెకెలె తయారు చేసిన ఈ సబ్బు ప్రస్తుతం స్కిన్‌  క్యాన్సర్‌ రోగులకు వరంగా మారింది. ఈ ప్రత్యేకమైన సబ్బు చర్మంలోని రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచి, క్యాన్సర్‌ కణాలను ఎదుర్కొనేలా చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ సబ్బు వాడితే చర్మంపై ఉన్న మలినాలకే కాదు, చర్మం లోపల చాపకింద నీరులా దాగి ఉన్న క్యాన్సర్‌ కణాలకు కూడా గుడ్‌బై చెప్పొచ్చు! కీమోథెరపీ, వేల కొద్దీ మాత్రలు అవసరం లేకుండా, ఒక చిన్న సబ్బుతోనే క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధనల దశలో ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు దీని పనితీరుపై విశ్వాసంతో ఉన్నారు. ఇది కచ్చితంగా ఉపయోగకరమైన ఫలితాలను ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఈ అద్భుత ఆవిష్కరణకు గుర్తింపుగా హీమన్‌  బెకెలెకు టైమ్‌ మ్యాగజైన్‌ ‘2024 కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు లభించింది. అంతేకాదు, ‘త్రీ ఎమ్‌ యంగ్‌ సైంటిస్టు’ చాలెంజ్‌లో పాల్గొని, పాతికవేల డాలర్లు (అంటే రూ. 21,82,600) నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఇంత డబ్బు వచ్చిందని పుస్తకాలకు గుడ్‌బై చెప్పలేదీ హీమ¯Œ . స్కూల్‌లో క్లాసులు, హోమ్‌వర్క్‌ల మధ్యలో కూడా ఫార్ములాలను కలిపి ఈ క్యాన్సర్‌ కిల్లింగ్‌ సబ్బు మీద తన పరిశోధనను కొనసాగిస్తున్నాడు. దీనిని త్వరలోనే పెద్దస్థాయిలో ఉత్పత్తి చేసి, అవసరమున్నవారికి ఉచితంగా అందించాలన్న ఆశయంతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలని కలలు కంటున్నాడు.

అలా మొదలైంది!
ఇంత చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప ఆలోచన రావడానికి ఓ గట్టి కారణం ఉంది. హీమన్‌  పుట్టిన ఇథియోపియాలో ప్రజలకు తగినన్ని వైద్య సౌకర్యాలు లేకపోవడాన్ని చిన్నప్పుడే గమనించాడు. అందుకే, ‘అందరికీ వైద్య సౌకర్యాలు అందాలంటే ఎలా?’అనే ప్రశ్నతో మొదలుపెట్టి, అందరికీ చౌకగా, సులభంగా చికిత్స అందించే మార్గాన్ని వెతికాడు. ఆ వెతుకులాట చివరకు బాత్‌రూమ్‌ షెల్ఫ్‌పై ఉన్న సాధారణ సబ్బు దగ్గర ఆగింది. అలా రోజూ వాడే సబ్బులో శాస్త్ర విజ్ఞానాన్ని, రసాయనాలను కలిపి, ఒక మహాశక్తిమంతమైన ఆయుధంగా మార్చేశాడు.  

#

Tags : 1

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)