Breaking News

Kareena Kapoor: పరాఠా విత్‌ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..!

Published on Fri, 06/27/2025 - 13:43

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఎవర్‌గ్రీన్‌ నటనతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న నటి ఆమె. ఇప్పటికి కుర్ర హీరోయిన్‌లకు తీసిపోని విధంగా గ్లామర్‌గా ఉంటారామె. ముఖ్యంగా ఆమె ఫిట్‌నెస్‌ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. మంచి జీవనశైలిని పాటిస్తారామె. తరుచుగా ఆమె ఈ విషయాలను సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్‌ చేస్తుంటారు. తన వర్కౌట్ల నుంచి ఆరోగ్యకరమైన డైట్‌ వరకు ప్రతిదీ పంచుకుంటారామె. అయితే హీరో హీరోయిన్‌లు ఎంతలా స్ట్రిక్ట్‌గా ఫిట్‌నెస్‌కి ప్రాముఖ్యత ఇచ్చినా..కెరీర్‌ పరంగా కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే పాత్ర డిమాండ్‌కి అనుగుణంగా వాళ్ల ఆకృతిని మార్చుకోక తప్పదు. ఆ క్రమంలో ఆరోగ్యానికి విరుద్ధమైన డైట్‌లను అనుసరించాల్సి ఉంటుంది. అలానే కరీనా కూడా ఓ మూవీ కోసం జీరో సైజ్‌ ఫిగర్‌ మెయింటైన్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం ఎలాంటి ఫుడ్‌ తీసుకునేదో తెలిస్తే నోరెళ్లబెడతారు. ఏంటి పరాఠాలతో తగ్గడం అని షాక్‌కి గురవ్వుతారు. కానీ కరీనానే ఓ ఇంటర్వ్యూలో పరాఠా విత్‌ నెయ్యితోనే జీరో సైజ్‌ బరువుకి వచ్చానని చెప్పడం విశేషం. మరి అదెలాగో చూద్దామా..!.

వెయిట్‌ లాస్‌ జర్నీలో సక్సెస్‌ కానీ వాళ్లకు కరీనా అనుసరించిన విధానం ఓ వరమనే చెప్పాలి. ఎందుకంటే పాపం నోరు కట్టేసుకుని ఫైబర్‌ కోసం రుచి పచి లేని ఫుడ్‌ తింటుంటారు. అయితే ఇలా కమ్మటి పరాఠాలు, నెయ్యి కలిపి హాయిగా తింటూనే బరువు తగ్గే విధానం తెలుసుకుంటే హమ్మయ్యా అనే ఫీలింగ్‌ వచ్చేస్తుంది. మరీ ఆమె వీటితో సైజ్‌ జీరోకి ఎలా రాగలిగందంటే..

2008 యాక్షన్-కామెడీ 'తాషన్'లో కరీనా కపూర్ జీరో సైజ్‌ ఫిగర్‌తో అందరినీ ఆశ్యర్యపరిచింది. అయితే ఆమె ఎప్పుడూ ఆకలితో అలమటించే డైట్‌లు ఫాలో కానని అంటోంది. ఎప్పుడూ పరాఠాలు తింటూనే ఉంటానంటోంది. అలా తింటూ..కూడా రోజంతా తీసకునే ఆహార క్రమాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటే చాలని చెబుతోందామె. అయితే ఆమె ఆ మూవీ కోసం దాదాపు 68 కిలోల నుంచి 48 కిలోలు చేరుకునేందుకు అస్సలు ఆకలితో ఇబ్బందిపడే లేదట. 

(చదవండి: Dinner: సాయంత్రం 6.30కి తినేయడమే మంచిదా? నటి కరీనా కపూర్‌ కూడా..)

తన ఫిట్‌నెస్‌ టీమ్‌ పోషకాహార నిపుణుడు రుజుత దివేకర్, ట్రైనర్‌ నమ్రత పురోహిత్‌ల సాయంతో అద్భుతంగా బరువు తగ్గానని చెప్పారామె. అందుకోసం తాను సరైన మార్గాన్ని అవలంభించే మంచి శరీరాకృతిని పొందినట్లు తెలిపారామె. తాను అస్సలు తినకుండా ఉండలేనని అంటోంది. అయితే తాను సరైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకునేలా రుజుత దివేకర్‌ నెయ్యితో పరాఠాలు, కుంకుమ పువ్వు నీళ్లు తీసుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. వాటి తోపాటు గుల్కండ్‌ అనే స్వీటు, గోరువెచ్చని పాలు తప్పనిసరిగా తీసుకునేదాన్ని అని అంటోంది. 

అయితే 2018లో మొదటి బిడ్డ ప్రసవానంతరం బరువు పెరిగానని, అయితే త్వరితగతిన బరువుని అదుపులోకి తెచ్చుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే తాను జిమ్‌లో 55 నిమిషాలకు మించి ఎక్కువసేపు ఉండలేనని అన్నారు. తాను ఎక్కువగా పవర్‌ యోగా, పైలట్స్‌ వర్కౌట్లతో బాడీని ఫిట్‌గా ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ఇక్కడ కరీనా..తనకిష్టమైన ఆహారాన్ని వదులకోకుండానే బరువు తగ్గే ప్రయత్నం చేశారు. మైండ్‌ఫుల్‌నెస్‌గా ఇష్టమైన ఆహారాలు దూరం చేసుకోకుండా తగ్గడమే ఆరోగ్యదాయకమని చెప్పకనే చెప్పారామె. సో ఆమెలా ఒక క్రమ పద్ధతిలో నచ్చిన ఫుడ్‌ తీసుకుంటూనే తగ్గే ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఉందామా..!.

(చదవండి: ది బెస్ట్‌ ఐస్‌ క్రీమ్‌లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్‌లకు చోటు..!)

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)