Breaking News

ఫొటోలో చూసి...  ప్రేమలో పడి...

Published on Sun, 07/12/2026 - 06:20

జానకి మామయ్య చంద్రశేఖర్‌ ‘ఫన్‌ డాక్టర్‌’. ఆయన సూచన మేరకు చెన్నై చేరుకుని, గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు జానకి. ఇదిలా ఉంటే... ఒక వేదికపై జానకి పాడిన పాట విని, ముగ్ధులయ్యారు వి. రామ్‌ప్రసాద్‌. కాగా, ఓసారి చంద్రశేఖర్‌ జేబులోంచి ఒక ఫొటో కింద పడితే, ఆ ఫొటోలోని వ్యక్తిని ఇష్టపడ్డారు జానకి. ఆ వ్యక్తి ఎవరో కాదు... వి. రామ్‌ప్రసాద్‌. కానీ, ఆ ప్రేమను బయపెట్టలేదు. 

అయితే ఒక సందర్భంలో చంద్రశేఖర్‌ స్వయంగా జానకిని రామ్‌ప్రసాద్‌కి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ ఇద్దరి వివాహం 1959లో జరిగింది. 1997లో రామ్‌ప్రసాద్‌ గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటివరకూ కూడా జానకి ఏ పాటల రికార్డింగ్‌కి వెళ్లినా ఆమె వెన్నంటే ఉండేవారు. జానకిని బాగా ప్రోత్సహించారు. భర్త మరణానంతరం జానకి ‘రంగు’ చీరలు కట్టుకోకూడదనే నిర్ణయం తీసుకున్నారు. 

‘‘ఆయనకు నా ప్రతి పాట ఎంతో ఇష్టం. నా రికార్డింగ్‌ సెషన్ ్సలో కూడా ఆయన నన్ను అస్సలు వదిలిపెట్టేవారు కాదు. నేను కూడా ఆయన్ను వదిలి ఉండలేకపోయేదాన్ని. ఆయన తన జీవితమంతా నా కోసమే గడిపారు. ఆయన మద్దతు లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఆయన నాతో ఉన్నారు, నాతోనే ఉన్నారు, ఇకపై కూడా నా ఆలోచనల్లో ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు!’’ అంటూ భర్త దూరమైన తర్వాత ఓ సందర్భంలో జానకి ఎంతో భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ దంపతుల కుమారుడు మురళీకృష్ణ భరతనాట్యంలో ప్రవీణుడు. కొన్ని తెలుగు చిత్రాల్లో నటించారు కూడా. ఈ ఏడాది జనవరిలో మురళీకృష్ణ మరణించారు. అలాగే కొన్ని రోజుల క్రితం అమెరికాలోని తన మనవడు చనిపోవడంతో జానకి చాలా మనోవేదనకు గురయ్యారు.
 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)