షిర్డీని దర్శించుకున్న నీతా అంబానీ : సింపుల్‌గా, సాంప్రదాయంగా

Published on Mon, 04/14/2025 - 17:30

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, మానవతావాదిగా మాత్రమే కాదు ఆధ్యాత్మికవాదిగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు. ఇటీవల నీతా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించింది. సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పటి లాగానే ఈ సారి కూడా  ఆమె   సాంప్రదాయదుస్తుల్లో దుస్తుల్లో  తన స్టైల్‌ని చాటుకున్నారు. తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్‌తో కలిసి నీతా అంబానీ ఇక్కడికి రావడం విశేషంగా  నిలిచింది.

నీతా అంబానీ  వీడియోను అంబానీ అప్‌డేట్‌ పేజ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.  తల్లి పూర్ణిమ దలాల్ ,సోదరి మమతా దలాల్‌తో కలిసి షిర్డీ ఆలయంలో బాబాను దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్దలతో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా పాదాలకు మొక్కొ ఆశీర్వాదం తీసుకున్నారు. నీతా అంబానీ పువ్వులు సమర్పించడం, దీపాలు వెలిగించడం ,ఆలయంలో సమయం గడపడం ఈ వీడియోలో  చూడవచ్చు.  అలాగే ఆలయం తరుపున ఆమెకు షిర్డీ సాయిబాబా జ్ఞాపికను  కూడా బహుకరించారు.

ముఖ్యంగా సింపుల్‌  గులాబీ రంగు బాంధానీ కుర్తాలో చాలా హుందాగా కనిపించారు. దీనికి జోడీగా  పింక్‌  కలర్‌ మ్యాచింగ్‌ దుపట్టాతో  సింపుల్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. అలాగే డైమండ్ స్టడ్‌లు,  రత్నాలు పొదిగిన గాజులు , ఉంగరాలతో  చాలా సరళంగా కనిపించారు.

 కాగా ఇటీవల నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ 30వ పుట్టిన రోజు సందర్భంగా అనంత్, కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి రామ నవమి వేడుకల కోసం ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.
 

 

#

Tags : 1

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)