Breaking News

పప్పులతో ఫేస్‌ప్యాక్‌.. ముఖం బంగారంలా వెలిగిపోతుంది

Published on Thu, 12/21/2023 - 16:27

బ్యూటీ టిప్స్‌

►ఎర్ర పప్పు మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది. ఎర్రపప్పులోని పోషకాలు,విటమిన్లు చర్మ రంగుని మెరుగ్గా చేస్తాయి. ఈ ఎర్రపప్పుతో ఫేస్‌ప్యాక్‌ వల్ల మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది.

►కప్పు ఎర్రకందిపప్పు (మసూర్‌దాల్‌) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్‌ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. 

► మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. 

► రెండుగంటలు నానిన నాలుగు టీస్పూన్ల పొట్టు పెసరపప్పుని పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను ఆరెంజ్‌ పీల్‌ పొడి, టీస్పూను గంధం పొడి వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరవాత కొద్దిగా నీటితో తడిచేసి మర్దన చేసి కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా, అందంగా కనిపిస్తుంది. 

హెయిర్‌ టిప్స్‌

► టీస్పూను అలోవెరా జెల్, రెండు టేబుల్‌ స్పూన్ల ఉల్లి రసం, మూడు టీస్పూన్ల కొబ్బరి నూనెవేసి అన్నిటినీ చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు రాసి మర్దన చేయాలి. మరుసటిరోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పలుచబడిన మాడు ఒత్తుగా, నల్లగా నిగనిగలాడుతుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)