Breaking News

జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్‌! ఏకంగా 546 వజ్రాలతో..!

Published on Fri, 08/02/2024 - 13:40

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో పతకాలు ఎలా ఉన్నా..ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, కదిలించే కన్నీటి గాథలు, అద్భుతాలు ఉన్నాయి. వాటి తోపాటు ఓ క్రీడాకారిణి ధరించిన లాకెట్టు నెట్టింట్ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి బరిలోకి దిగే క్రీడాకారులు ఫ్యాషన్‌ లాకెట్టులు అంతగా ధరించరు. మహా అయితే నెక్‌కు ఉండే తేలికపాటి గొలుసులు ధరస్తారంతే..కానీ ఈ అమెరికన్‌ జిమ్నాస్ట్‌ మాత్రం వెరీ స్పెషల్‌. ఎందుకుంటే తనను ఏ జంతువుతో హేళన చేశారో దాన్నే లాకెట్‌గా డిజైన్‌ చేయించుకుని మరీ ఫ్యాషన్‌కు సరికొత్త పాఠాలు నేర్పింది. 

2013 నుంచి ఓటమి ఎరుగని ఆల్‌రౌండ్ ఛాంపియన్. జిమ్నాస్టిక్స్ సరిహద్దులను చెరిపేసిన క్రీడాకారిణి జిమ్నాస్ట్  సిమోన్‌ బైల్స్‌. ఈ 27 ఏళ్ల జిమ్నాస్ట్‌ గురువారం స్వర్ణం గెలుచుకుని, తన కెరీర్‌లో 39వ పతకాన్ని సాధించింది. దీంతో ఆమె రెండోవ ఒలింపిక్స్‌ ఆల్‌ రౌండర్ టైటిల్‌ని, వరుసగా తొమ్మిదొవ ఒలింపిక్‌ పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది. ఈ పారిస్‌ 2024 ఒలింపిక్‌లో రెండో బంగారు పతాకాన్ని గెలుచుకున్న వెంటనే తాను ధరించిన మేక లాకెట్టుతో కెమెరాకు ఫోజులిచ్చింది. అంతేగాదు ఆమె ఈ గెలుపుతో మొత్తం ఆరు ఒలింపిక్‌ బంగారు పతకాలను గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా 120 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. 

ఆ సందర్భంగా తన లాకెట్టుని ప్రదర్శించింది. "ఇది చిన్న మేక లాకెట్టు కావొచ్చు. కానీ ఈ మేకును అందరూ ఇష్టపడుతారు. అందరూ నన్ను మేక అంటూ పిలిచి హేళన చేశారు. అసలు దాన్నే లాకెట్టుగా చేసుకుని ధరించి ప్రత్యేకంగా ఉండాలనిపించి. అంతేగాదు ద్వేషించేవారు ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్లు నన్ను అలా ఆ జంతువు పేరుతో పిలవడాన్ని ప్రత్యేకంగా భావించానే గానీ నెగిటివ్‌గా తీసుకోలేదు. అదీగాక తన వద్ద స్టఫ్డ్‌ మేక కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బహుశా వారు దాన్నే గుర్తు చేస్తున్నారని అనుకున్నా". అంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. 

ఇదిలా ఉండగా, కాలిఫోర్నియా జ్యువెలరీ కంపెనీ బైల్స్‌ అభ్యర్థన మేరకు ఈ మేక లాకెట్టుని తయారు చేసినట్లు తెలిపింది. దీన్ని దాదాపు 546 వజ్రాలతో అలంకరించినట్లు వెల్లడించింది. ఇది త్రిమితీయ కళాఖండం అని, జిమ్నాస్టిక్స్‌లో ఆమె అసామాన ప్రతిభ, ఖచ్చితత్వం, అంకితభావం, పట్టుదల తదితరాలను ఇది ప్రతిబింబిస్తుందని సోషల్‌ మీడియా పోస్ట్‌లో జ్యువెలరీ కంపెనీ పేర్కొంది. 

(చదవండి: రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్‌!)
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)