Breaking News

సిమ్‌ లేదు.. సిగ్నల్‌ లేదు.. అయినా ‘హలో!’

Published on Sun, 01/04/2026 - 09:05

‘నీతో మాట్లాడాలని ఎంతో ఉంది. కాని, నా రీచార్జ్‌ ప్లాన్‌ అయిపోయింది’ అని ఫోన్‌  నోరు మూసేసే బాధ ఒకరిదిదైతే,  ప్రతి నెలా మొబైల్‌ బిల్లుల రిమైండర్‌కి భయపడి ముందుగా చెల్లించే వారిది ఇంకోరకం బాధ. ఇలా రీచార్జ్‌ కష్టాల మాయలో మునిగిపోయినప్పుడు ఆఫ్రికాలోని ఒక అబ్బాయి నెట్‌వర్క్‌కే నేరుగా ‘గుడ్‌ బై’ చెప్పేశాడు. సిమ్‌ లేదు, టవర్‌ లేదు, డేటా అవసరం అసలే లేదు, అయినా కూడా ఫోన్‌ లో ‘హలో!’ అన్నాడు. అదే సైమన్‌  పీట్రస్‌ కనిపెట్టిన టెక్నాలజీ మ్యాజిక్‌!  

ఆఫ్రికాలోని న మీబియాలో ఉండే ఓ చిన్న గ్రామం. అక్కడ గాలి, ఇసుక, నిశ్శబ్దం తప్ప పెద్దగా టెక్నాలజీకి హలో చెప్పేవారు తక్కువ. చాలామంది ఇళ్లలో విద్యుత్‌ కూడా ఉండదు. ఇక మొబైల్‌ సిగ్నల్‌ అంటే లాటరీ కొట్టడం లాంటిది. ఇలా నెట్‌వర్క్‌ కూడా లేని ఊరిలో పెరిగిన సైమన్‌ , అసలు సమస్య సిగ్నల్లో లేదని, టెక్నాలజీలో ఉందని నమ్మాడు. ఆ నమ్మకమే అతన్ని సిమ్‌ లేకుండా కాల్‌ చేసే ఫోన్‌  వైపు నడిపించింది.

 చాలామంది ‘ఇది ఎలా సాధ్యం?’ అంటూ నవ్వుకున్నారు. కాని, అతను మాత్రం పాత రేడియోలు, టీవీలు, మొబైల్‌ స్క్రాప్స్‌ అన్నింటినీ కలిపి ఒక కొత్త ఫోన్‌  తయారు చేశాడు. రేడియో ఫ్రీక్వెన్సీతో రెండు దారులుగా మాట్లాడుకునే సిస్టమ్‌. వాకీ–టాకీలా కనిపిస్తుంది కాని, కాదు. పూర్తిగా ఫోన్‌ రూపంలోనే తయారుచేశాడు. ఈ ఫోన్‌లోనే టీవీ చూడొచ్చు, లైట్‌ ఆన్‌ చేయొచ్చు, ఒక ఇన్‌బిల్ట్‌ సోలార్‌ చార్జర్‌ని సెట్‌ చేశాడు. అతని ప్రతిభను మెచ్చి, స్కూల్‌ సైన్‌ ్స ఫెయిర్‌లో మొదటి బహుమతి ఇచ్చేశారు. 

వార్తలు అంతర్జాతీయంగా పాకాయి. కాని, ఆ తర్వాత పెద్ద కంపెనీలు, పెట్టుబడిదారులు, పరిశోధన కేంద్రాలు ఎవరూ ముందుకు రాలేదు. ఇది కొంచెం బాధే. అయినప్పటికీ, చాలామంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, యువ ఆవిష్కర్తలు అతని ప్రయోగాన్ని అభినందిస్తున్నారు. 

పునర్వినియోగ టెక్నాలజీలు, నూతన విద్యుత్‌ పనితీరులు, కమ్యూనికేషన్‌  రంగాల్లో సైమన్‌  ప్రయోగం ఒక మంచి ప్రేరణగా నిలుస్తోందని ప్రసంసిస్తున్నారు. కొన్నిసార్లు కోట్ల బడ్జెట్‌లు, భారీ లాబొరేటరీలు, పెద్ద పెద్ద కంపెనీలు తప్పనిసరి కాదు, కాని, భవిష్యత్తు ఆవిష్కరణలు ఒక చిన్న స్పార్క్‌తోనే మొదలవుతాయి అని సైమన్‌ అందరికీ రిమైండ్‌ చేస్తున్నాడు. 
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)