Breaking News

ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా? జాగ్రత్త.. ఇవి తెలుసుకోవాల్సిందే

Published on Wed, 06/28/2023 - 14:41

ఈమధ్య కాలంలో ఏసీల వినియోగం బాగా పెరిగింది.ఇల్లు, ఆఫీస్‌,ప్రయాణాల్లోనూ ఏసీలో ఉండటానికే ఇష్టపడతాం.కాస్త వేడిగా అనిపిస్తే చాలు ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. అలా ఏసీల వినియోగం ప్రస్తుతం వ్యసనంగా మారిపోయింది.

కానీ ఈ ఎయిర్ కండీషనర్ శరీరాన్ని ఎంత దారుణంగా ప్రభావితం చేస్తుందో తెలుసా? రోజులో ఎక్కుసేపు ఏసీలో ఉంటే ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ వచ్చే ప్రమాదం ఉంది. ఏసీ వినియోగం మితిమీరితే శరీరంపై కలిగే దుష్ప్రభావాలు ఏంటన్నది ఈ స్టోరీలో చదివేయండి.


► ఏసీలు వేయగానే డోర్‌లు మూసేస్తాం. దీనివల్ల బయటి గాలి లోపలికి రాదు. దీంతో ఆక్సిజన్‌ తక్కువ అయి తలనొప్పి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మైగ్రేన్‌కు కూడా దారితీస్తుంది.
► ఏసీ వల్ల రక్తంలో ఆక్సిజన్‌ తక్కువై శరీరం త్వరగా ఆలసిపోతుంది. లోబీపీ వస్తుంది.
► ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల శరీరంలో తేమ తగ్గుతుంది.దీని కారణంగా, చర్మం పగుళ్లు ఏర్పడి పొడిగా మారుతుంది.
► ఎక్కువగా ఏసీలో ఉండే వ్యక్తులు తలనొప్పి వంటి సమస్యలను తరచూ ఎదుర్కొంటారు.


► ఏసీ చల్లదనం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతాం. ఏసీలో ఉండటం వల్ల ఎక్కువ శాతం నీరు తాగాలనిపించదు. ఇది కిడ్నీ సమస్యకు కూడా దారితీయొచ్చు. 
► ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లు ఏసీలకు దూరంగా ఉండటమే మంచిదే.

► ఎక్కువ సేపు ఏసీలో గడిపేవారు ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గొంతు పొడిబారడం, రినిటిస్‌ వంటి సమస్యలతో ఇబ్బందిపడతారు.

► ఏసీల వల్ల మరో సమస్య ఎలుకలు సెంట్రల్‌ ఏసీల్లో గూడు కట్టుకుంటాయి. వ్యర్థాలను అక్కడే తింటాయి. ఫలితంగా ఏసీల్లో వాతావరణం విషపూరితం అవుతుంది. మనకు రకరకాల వ్యాధులు వస్తాయి. నెలకోసారి అయినా ఏసీలను క్లీన్‌ చేయాలి. అందుకే ఎక్కువ సేపు బయటి వాతావరణం పై ఆధారపడాలి. కిటికీలు, డోర్‌లు తెరిచిపెట్టాలి. సాధ్యమైనంత వరకు ఏసీలకు దూరంగా ఉండాలి.

Videos

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)