Breaking News

పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...

Published on Wed, 04/30/2025 - 10:39

కోల్‌కత్తాకు చెందిన అశ్వికాకపూర్‌ బీబీసి నేచురల్‌ హిస్టరీ యూనిట్‌ డైరెక్టర్‌. పశ్చిమబెంగాల్‌ అడవుల్లో ‘వణ్య్రప్రాణుల వేట’ పేరుతో ఉత్సవాలు చేస్తారు, ఇందులో పిల్లలు కూడా పాల్గొంటారు. దీనిపై ఆమె ‘క్యాటపల్ట్స్‌ టు కెమెరాస్‌’ చిత్రాన్ని తీసింది. ఈ చిత్రం న్యూయార్క్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ స్ఫూర్తిదాయక చిత్రంగా అవార్డు గెలుచుకుంది.

అశ్వికాలాంటి ఎంతోమంది మహిళా దర్శకుల విజయానికి ‘రౌండ్‌గ్లాస్‌ సస్టెయిన్‌’ దారి చూపింది.
‘రౌండ్‌గ్లాస్‌ సస్టెయిన్‌ ద్వారా వణ్య్రప్రాణుల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడూ వినని అరుదైన జీవులు గురించి కూడా తెలుసుకున్నాను. వైల్డ్‌లైఫ్‌ ఫిల్మ్‌మేకర్‌గా ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది అశ్వికాకపూర్‌. ‘రౌండ్‌గ్లాస్‌ సస్టెయిన్‌’ సంస్థను సియాటెల్‌కు చెందిన పారిశ్రామికవేత్త, దాత గుర్‌ప్రీత్‌ సన్నీసింగ్‌ స్థాపించారు. వణ్య్రప్రాణులపై విలువైన కథలు వెండితెరపై చెప్పడానికి వీలుగా ఇది మహిళా కథకులకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.

‘రౌండ్‌గ్లాస్‌ సస్టెయిన్‌ ఫిల్మ్స్‌ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఫండింగ్‌ నుంచి దర్శకులకు మార్గనిర్దేశం చేయడం వరకు రౌండ్‌గ్లాస్‌ సస్టెయిన్‌ ఎన్నో చేస్తుంది’ అంటుంది రౌండ్‌గ్లాస్‌ సస్టెయిన్‌ ఫిల్మ్స్‌’ క్రియేటివ్‌ డైరెక్టర్, ఫిల్మ్‌మేకర్‌ సమ్రీన్‌ ఫారూఖీ. ‘రౌండ్‌గ్లాస్‌ సస్టెయిన్‌’ నిర్మాణ సంస్థ తన వెబ్‌సైట్‌ ద్వారా సినిమాలను విడుదల చేస్తుంది. సినిమాలను ప్రమోట్‌ చేయడానికి టీమ్‌ విస్తృతంగా మార్కెటింగ్‌ కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తారు.

‘విస్మరించబడిన కథలను వెలుగులోకి తీసుకురావాలనుకుంటుంది. పెద్దగా ఎవరికీ తెలియని ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థలు, జాతులకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి తోడు లోకల్‌ ఫిల్మ్‌మేకర్స్‌పై దృష్టి పెట్టింది. సహజ ప్రపంచం గురించి మాట్లాడడానికి మల్టీమీడియా విధానాన్ని ఉపయోగిస్తోంది. ఫోటో స్టోరీలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వ్యాసాలు, కార్లూన్లు ఇందులో ఉంటాయి. కథలను సంచలనం కోసం చెప్పాలనుకోవడం లేదు. స్పష్టంగా చెప్పాలనుకుంటుంది’ అని రౌండ్‌గ్లాస్‌ సస్టెయిన్‌ గురించి చెబుతోంది సమ్రీన్‌.

పిల్లల జీవితాలను మార్చింది
వైల్డ్‌ లెఫ్‌ ఫోటోగ్రఫీ, చిత్రాల ద్వారా వేటకు వెళ్లే పిల్లల మనస్తత్వాలను మార్చాం. ఇప్పుడు వారు అడవి జంతువులను ‘వేట కోసం’ అన్నట్లుగా చూడడం లేదు. సంరక్షించుకోవాల్సిన అందమైన జీవులుగా చూస్తున్నారు. మా చిత్రనిర్మాణ ప్రక్రియ వన్య్రప్రాణులను కాపాడడమే కాదు పిల్లల జీవితాలను కూడా మార్చింది. తమ చుట్టూ ఉన్న సహజ ప్రపంచంతో కనెక్ట్‌ కావడానికి వారికి ఇది కొత్త మార్గాన్ని చూపించింది.
– నేహా దీక్షిత్, ఫిల్మ్‌మేకర్‌

వారే నిజమై హీరోలు
భూగోళ సంక్షోభం గురించి నిరాశపడడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంరక్షకులు, శాస్త్రవేత్తలు, రేంజర్ల రూపంలో ఆశ కనిపిస్తుంది. వారు నిజమైన హీరోలు. ఈ హీరోలు మన భూగోళాన్ని సురక్షితంగా ఉంచడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారి అంకితభావం మన ఆశావాదానికి బలాన్ని ఇస్తుంది. ఆ ఆశావాదాన్ని దశదిశలా వ్యాప్తి చేయడం ఫిల్మ్‌మేకర్‌గా నా బాధ్యత.
– అశ్వికా కపూర్, ఫిల్మ్‌మేకర్‌

నోరు లేని మూగజీవాలు, విలువైన ప్రకృతి గురించి చెప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి. వాటికి చిత్రరూపం ఇవ్వడానికి, మహిళలలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, వారిని డైరెక్టర్‌లుగా తీర్చిదిద్దడానికి ‘రౌండ్‌గ్లాస్‌ సస్టెయిన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది.

(చదవండి: ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!)

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)