Breaking News

మనసులో కుంచె ముంచి..

Published on Thu, 09/12/2024 - 12:14

కళ సామాజిక ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి బోలెడు మ్యాటర్‌ ఉంది. ‘వ్యక్తిగతం’ మాట ఏమిటి? అనే విషయానికి వస్తే...‘కళ అద్భుత ఔషధం’ అంటున్నారు అమెరికాలోని బాల్టిమోర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్వేతారావు గార్గ్‌.

‘ఒత్తిడిని చిత్తు చేయడానికి, ఉత్సాహాన్ని శక్తిగా చేసుకోవడానికి కళ బలమైన ఔషధంలా ఉపయోగ పడుతుంది’ అంటున్న శ్వేతారావు గార్గ్‌ బోధకురాలు, రచయిత్రి, ఆర్టిస్ట్‌. శ్వేతారావు గార్గ్‌ కాలేజీ రోజుల్లోకి వెళితే...‘ఒత్తిడి నుంచి బయటపడాలి’

‘మనసుకు కాస్త ఉత్సాహం కావాలి’ అనుకున్నప్పుడల్లా ఆమె చేసే పని... కలాన్ని చేతిలోకి తీసుకొని తన మనసులోని భావాలను కాగితంపై పెట్టడం. లేదా కుంచె తీసుకొని రంగు రంగుల చిత్రాలు వేయడం. ఈ ఉపశమనం, ఉత్సాహాన్ని ఇచ్చే పని కళాప్రపంచంలో తనకు చోటు కల్పిస్తుందని శ్వేత ఊహించి ఉండదు.
మొదట్లో తాను వేసిన చిత్రాలను ఇతరులకు చూపించేది కాదు. వాటిని రహస్యంగా దాచేది. వివిధ కారణాల వల్ల రచనలు చేయడానికి, బొమ్మలు వేయడానికి దూరమైన శ్వేత మళ్లీ కళాప్రపంచంలోకి వచ్చింది. అప్పుడు తనకు ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. బొమ్మలు వేయడమే కాదు నవలలు రాసే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది.

రచనలు చేస్తున్న కొద్దీ, బొమ్మలు వేస్తున్న కొద్దీ తనమీద తనకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘వీటిని రహస్యంగా దాచుకోవడం ఎందుకు! ప్రపంచానికి చూపించాలి’ అనుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ రచనలు, చిత్రాలను అధ్యయనం చేసిన శ్వేత అనుకరణ నీడల్లోకి వెళ్లకుండా తనదైన సొంత శైలిని సృష్టించుకుంది.

వంటగది నుంచి పిల్లల పెంపకం వరకు మహిళల దైనందిన జీవితంలో రకరకాల ఘట్టాలను కథలుగా మలిచింది. శ్వేత కళాత్మక సాధనలో ‘స్త్రీవాదం’ అనేది ప్రధాన అంశంగా మారింది. ఆమె రచనల్లో స్త్రీ ΄ాత్రలు పరాధీనంగా, బేలగా, నిస్సహాయంగా కనిపించవు. పురుషాధిపత్య ధోరణులను సవాలు చేసేలా, స్వతంత్య్రవ్యక్తిత్వంతో కనిపిస్తాయి. నిత్య ఉత్సాహంతో శక్తిమంతంగా కనిపిస్తాయి.

ఇక చిత్రకళ విషయానికి వస్తే శ్వేత ఏ ఆర్ట్‌ స్కూల్‌లోనూ పట్టా పుచ్చుకోలేదు. అయితే విన్సెంట్‌ వాన్‌ గోహ్‌ నుంచి అమృతా షేర్‌గిల్‌ వరకు ఎంతోమంది చిత్రకారులతో మౌనసంభాషణ చేస్తూనే ఉంటుంది. తనదైన విలక్షణ దృశ్యభాషను సృష్టించుకోవడానికి సాధన చేస్తూనే ఉంటుంది.

‘కాలేజీ రోజుల నుంచి నా భావాల వ్యక్తీకరణకు కళ అనేది బలమైన మాధ్యమంగా ఉపయోగపడింది. కథ అయినా కవిత్వం అయినా చిత్రం అయినా కొత్త కోణంలో కనిపించాలనుకుంటాను’ అంటుంది శ్వేత.
బోధన, పరిశోధన, కళలలో తనకు ఇష్టమైనది ఏమిటి?

ఆమె మాటల్లోనే చె΄్పాలంటే... ‘అవేమీ దేనికవి ప్రత్యేకమైన ప్రపంచాలు కావు. ఉదాహరణకు నా బోధన నేను చేసే పరిశోధనపై, నా పరిశోధన నా కళపై ప్రభావితం చూపిస్తాయి. ఒకదానికొకటి ఉపకరిస్తాయి’

శ్వేతారావు గార్గ్‌ గ్రాఫిక్‌ నవల ‘ది టేల్స్‌ ఫ్రమ్‌ క్యాంపస్‌: ఏ మిస్‌ గైడ్‌ టు కాలేజి’ క్యాంపస్‌ వాతావరణం కాస్తో కూస్తో పరిచయం లేని వారిని కూడా క్యాంపస్‌లోకి తీసుకువెళ్లి ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేస్తుంది. లింగభేదం, వేధింపులు, వర్గ హక్కులు, కులవివక్ష... ఇలా ఎన్నో అంశాలపై స్టూడెంట్స్‌ ఆలోచనలు, అవగాహనను ఈ నవల ప్రతిబింబిస్తుంది. పదమూడు చాప్టర్‌లలో ప్రతి చాప్టర్‌ తరువాత వచ్చే ‘స్టాప్‌ అండ్‌ థింక్‌’ సెక్షన్‌ ఎన్నో విషయాలలో పునరాలోచనకు అవకాశం కల్పిస్తుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)