Breaking News

పిట్ట మైల్డ్‌.. వేట వైల్డ్‌

Published on Sun, 10/12/2025 - 08:56

కాస్త వేట తెలిసిన పెద్దపెద్ద పక్షులైతే మాంసం ముక్కకోసం వెతుకుతాయి చిన్నా చితకా పక్షులు గింజలు తింటాయి. దొరికితే పురుగుపుట్రను నోట్లో వేసుకుంటాయి. అయితే ష్రైక్‌ అనే పక్షి క్రూరత్వాన్ని చూస్తే మాంసాహారులకు కూడా మనసు చలిస్తుంది.  దీని వేటలో అంత వ్యూహం ఉంటుంది మరి! ‘లానిడే’ కుటుంబానికి చెందిన అనేక రకాల పక్షులను ష్రైక్‌ పక్షులు అంటారు. 

ఈ పక్షులు చూడటానికి చాలా మైల్డ్‌గా కనిపిస్తాయి గాని, వీటిని వైల్డ్‌ బర్డ్స్‌ అని కూడా అంటారు. వీటికి వేటాడే జంతువులకు ఉన్నట్లుగా బలమైన కాళ్లు, గోళ్లు ఉండవు. అందుకే ఇవి తన ఆహారాన్ని విలక్షణంగా సమకూర్చుకుంటాయి. చిన్న కీటకాలు, బల్లులు, కప్పలు, చిట్టెలుకలు, కాస్త బలహీనంగా ఉండే రామచిలుకలను వేటాడి, వాటిని నిర్దాక్షిణ్యంగా బతికి ఉండగానే ముళ్ళ పొదలపైన లేదా పదునైన కొమ్మలపైన, మొనలుదేరిన తీగలపైన గుచ్చి చంపుతాయి. 

మాంసం దుకాణంలో మాంసాన్ని కొక్కేలకు వేలాడదీసినట్లుగా ఈ పక్షులు తమ ఆహారాన్ని ముళ్లకంపలకు వేలాడదీస్తాయి. ఈ పద్ధతి వాటి మనుగడకు అత్యంత కీలకం. ష్రైక్‌ పక్షులు తమ ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, తర్వాత అవసరమైనప్పుడు ముక్కలుగా చేసి తినడానికి ఈ విధానాన్నే ఎంచుకుంటాయి. 

మనకు ఈ పద్ధతి క్రూరంగా అనిపించినా, ప్రకృతిలో ఈ జీవులు తమ మనుగడ కోసం అనుసరించే వ్యూహం ఇదంతా. ఇక తినే ఆహారం విషతుల్యమైందనే అనుమానం వస్తే,  ఈ పక్షులు తాము వేటాడిన ఆహారాన్ని అక్కడే వదిలిపెట్టి మరునాడు వచ్చి, అప్పటికి సురక్షితంగా ఉన్నట్లయితే తింటాయట!
 

#

Tags : 1

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)