Breaking News

స్త్రీ సాధికారత దిశగా..

Published on Mon, 06/02/2025 - 10:20

మహిళలు తమ కాళ్లపై నిలబడి.. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు దాదాపు దశాబ్దకాలంగా తోడ్పాటునందిస్తోంది తెలంగాణలోని సాయి సమాజ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌. ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్త్రీల సాధికారతకు బాటలు వేస్తోంది. వందలాది మంది మహిళల ఆర్థిక ఆలంబనకు కృషి చేస్తోంది. స్త్రీ ఆర్థిక పురోగతి సాధించినప్పుడే ఆ కుటుంబం.. తద్వారా ఆ దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని నమ్మిన సిద్ధాంతం మేరకు ట్రస్ట్‌ సేవలు కొనసాగిస్తోంది. 

పేద, మధ్య తరగతి వర్గాల మహిళలకు కుట్టు మిషన్, మగ్గం వర్క్‌ (డిజైన్‌)లపై ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తూ చేయూతనందిస్తోంది. ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకూ 35 మంది మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో ఇప్పటి వరకూ 23 బ్యాచ్‌లకు పైగా శిక్షణ ఇచ్చామని ట్రైనర్‌ అనూష ‘సాక్షి’తో చెప్పారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో స్వయం ఉపాధి శిక్షణ తీసుకొని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లను ప్రధానం చేస్తామన్నారు. 

ఉపాధి అవకాశాల్లో మెరుగుదల.. 
నిరుపేద మహిళలకు సొంతంగా ఉపాధి చేసుకోడానికి మొగ్గు చూపుతున్నారు. చీరలు, బ్లౌజులపై డిజైన్‌ వేయడానికి మగ్గం వర్క్‌ నేర్పిస్తున్నాం. దీంతో స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. 
– ఉమా, శిక్షకురాలు

కుట్టుమిషన్‌పై శిక్షణ.. 
సాయి సమాజ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలకు కుట్టుమిషన్‌లో బ్లౌజులు, పలు రకాల పంజాబీ డ్రెస్సులపై శిక్షణ ఇస్తాం. మహిళలకు శిక్షణ ఇచ్చి మూడు నెలల తర్వాత సర్టిఫికెట్లను అందజేస్తాం. 
– అనుష, శిక్షకురాలు 

తరగతులతో మేలు.. 
ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్, ఇతర మగ్గం, ఎంబ్రాయిడరీ వర్క్‌ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. అన్ని విధాలా శిక్షణ తీసుకొని మా సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందేందుకు దోహదపడుతుంది.  
– సంగీత, కుట్టుమిషన్‌ నేర్చుకున్న మహిళ  

(చదవండి: సమానత్వం..  సాధికారత సాధిస్తా!)

Videos

మరోసారి పోకిరి కాంబో.. వారణాసితో పాన్ వరల్డ్ షేక్

తిరుపతి అలిపిరి వద్ద తోపులాట

కోడిని చంపినట్లు భర్తలను చంపుతున్న భార్యలు

తోలు తీస్తా, తొక్క తీస్తా.. చివరికి మీ వాడికే తోలు తీశారు

వాటికన్ సిటీ, బెత్లహంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

పిక్నిక్ వెళ్తుండగా విషాదం.. స్కూల్ బస్సు బోల్తా..

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

తొక్క.. తోలు.. అన్నావ్.. ఆ ఆవేశం ఏమైంది..

ఒక్కసారిగా కారులో మంటలు..8 మంది..

మళ్లీ అదే మాట.. శివాజీ నోటి దూల

Photos

+5

టాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

కర్నూల్ ఇన్సిడెంట్ కర్ణాటకలో రిపీట్! (చిత్రాలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా టాలీవుడ్‌ ప్రో లీగ్‌ ప్రారంభం (ఫొటోలు)

+5

హీరోయిన్ తమన్నా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

శరత్ కుమార్-రాధిక క్రిస్మస్ లంచ్‌లో కోలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

హృతిక్ రోషన్ కజిన్ పెళ్లి.. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో క్రిస్మస్‌ పండగ సందడి (ఫొటోలు)

+5

వారణాసి ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)