Breaking News

ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..!

Published on Wed, 06/03/2026 - 09:34

నిజంగా జీవంలేని ఏ ప్రాణిలోని కణాలు గానీ సూక్ష్మజీవులు గానీ బతికే ఛాన్స్‌ ఉండదు. అది కూడా వేల ఏళ్ల నాటి మమ్మీ లాంటి వాటిల్లో కూడా ఉండవనేది జగమెరిగిన సత్యం. ఒక జీవిలో ప్రాణం లేకపోతే..అచైతన్యంగా..నిర్జీవంగా అయిపోతుంది లేదా కొన్ని రోజులకి విచ్ఛిన్నమైపోతుంది. అలాంటిది వేల ఏళ్ల నాటి మమ్మీ అది కూడా గడ్డకట్టిన చలిలో ఉన్న మృతదేహంలో సజీవంగా పేగు బ్యాక్టీరియా ఉండటాన్ని చూసి విస్తుపోయారు శాస్త్రవేత్తలు

ఇటాలియన్‌ ఆల్ప్స్‌ పర్వతాల్లో ఓట్జీ ది ఐస్‌మ్యాన్‌ బాణం దెబ్బకు గురై చనిపోయాడు. కానీ అతని శరీరం గట్‌ బ్యాక్టీరియాతో కళకళలాడుతుండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. ఇది అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ. ఇక్కడ చరిత్ర పూర్వపు ప్రేగు బ్యాక్టీరియా చలికి ఇంకా బతికే ఉండటం అనేది విశేషం. ఆ చలి వాతావరణానికి అనుగుణంగా ఈస్ట్‌ జాతులు జీవక్రియపరంగా చురుకుగా ఉన్నాయని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ పురాతన సూక్ష్మజీవులు తమ కళ్లముందే చురుకుగా తమను తాము మార్చుకుంటూ పరిణామం చెందుతున్నాయని చెబుతున్నారు. 

వీటిని మమ్మీ చర్మం, అంతర్గత కణజాలాలు, కరిగిన మంచు నీటిని విశ్లేషించడం ద్వారా ఈ రహస్య పూర్వ జీవావరణ వ్యవస్థను గుర్తించినట్లు తెలిపారు. ఒక రకంగా ఈ పరిశోధన మన గతాన్ని తెలిపే అద్భుతమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు. అంతేగాదు చనిపోయిన ఆ వ్యక్తి ఓట్జీ చివరి భోజనమైన అధిక కొవ్వు అడవి మాంసం, పురాతన​ ధాన్యాలతో అతని పేగులోని క్రియాశీల బ్యాక్టీరియా కచ్చితంగా సరిపోలిందన్నారు. 

ఆ వ్యక్తిలో రోంబౌట్సియా హోమినిస్, క్లోస్ట్రిడియం మోనిలిఫార్మ్ వంటి అరుదైన గట్‌ బ్యాక్టీరియాను గుర్తించినట్లు తెలిపారు. ఇది ఆధునిక మానువుల్లో దాదాపు కనుమరుగైందన్నారు. కానీ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని గిరిజన సముహాల్లో ఇలాంటి పేగు బ్యాక్టీరియా ఉందన్నారు. ఇవి శరీరాన్ని రక్షించేలా హానికరమైన క్రిమిసంహారకాలను తింటూ..మనుగడ సాగిస్తాయన్నారు.

(చదవండి: చింతగింజలతో మైక్రో ప్లాస్టిక్‌కి చెక్‌..!)

 

#

Tags : 1

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు