Breaking News

అభినయ శోభన

Published on Sun, 02/09/2025 - 01:50

మూడేళ్ల వయసులోనే నర్తకిగా మారి, నాట్యమయూరిగా ఎదిగింది. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే మనస్తత్వం, వన్నె తగ్గని అందం, చిన్న పిల్లలాంటి చలాకితనం ఇవన్నీ ఒక్కచోటే ఉంటే, కనిపించే రూపమే నటి, ప్రముఖ నర్తకి శోభన . ఇటీవల ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్‌’ ప్రకటించింది. 
ఆమె విశేషాలు మీ కోసం..

శోభన సొంత ఊరు తిరువనంతపురం. ‘ట్రావెన్‌కోర్‌ సిస్టర్స్‌’గా నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి గాంచిన లలిత, పద్మిని, రాగిణిలకు 
మేనకోడలు.

‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్‌ 18’ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది.  

‘మణిచిత్రతారు’ అనే మలయాళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ‘మిత్ర్, మై ఫ్రెండ్‌’ అనే ఇంగ్లిష్‌ చిత్రంలో నటనకు మరోసారి జాతీయ పురస్కారాన్ని సాధించింది.

చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఎంతో ఇష్టం. 1994లో ‘కళార్పణ’ పేరిట చెన్నైలో నాట్య పాఠశాలను ఏర్పాటు చేసి, భరత నాట్యంలో శిక్షణ ఇస్తోంది. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్‌’ పురస్కారాన్ని ప్రకటించింది.

శోభనకు నాట్యం చేసేటప్పుడు ఎవరైనా ఫోన్‌లో రికార్డ్‌ చేస్తే చాలా కోపం. ఒకసారి ప్రదర్శన మధ్యలో ఫోన్‌లో రికార్డు చేస్తున్న ఒక ప్రేక్షకుడిని వారించింది.

శోభనకు థాయ్, చైనీస్‌ వంటకాలు బాగా ఇష్టం. మలేసియాకు వెళితే, అక్కడ స్ట్రీట్‌ ఫుడ్‌ కూడా ఆస్వాదిస్తుంది. చీజ్‌ ఆమ్లెట్‌ అంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం.

పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్‌ చేయాలని ఉంది. నా దుస్తులను నేనే డిజైన్‌ చేసుకుంటాను. ఒంటికి నప్పని దుస్తులను నేనెప్పుడూ ధరించను. బహుశా, నా దుస్తులే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయనుకుంటా. – శోభన

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)