Breaking News

యాంటీ ఏజింగ్‌ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?

Published on Mon, 06/30/2025 - 15:08

కాంటా లగా గర్ల్ షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) అకాల మరణం అనేక ఊహాగానాలు, ఆందోళనలను తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా యాంటీ-ఏజింగ్ ట్రీట్మెంట్స్ అండ్ ఫాస్టింగ్  టాక్సిక్ కాక్టెయిల్ ఆమె ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

షెఫాలిఖాళీ కడుపుతో కాస్మెటిక్ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకొని ఉండవచ్చని, ఇదే గుండెపోటుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న షెఫాలి ఖాళీ కడుపుతో గ్లూటాతియోన్ , విటమిన్ సి కలిగిన కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్  తీసుకున్నారనీ,   ఆ వెంటనే ఆమె తీవ్ర అస్వస్తతతకు గురైందట. ఒళ్లు వణకడం, తర్వాత స్పృహ కోల్పోవడంతో తక్షణమే ఆమె భర్త పరాగ్ త్యాగి ముంబైలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతేకాదు షెఫాలీ ఇంట్లో యాంటీ ఏజింగ్ ఇంజక్షన్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్లు, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరకడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. అంతే కాదు ఎనిమిదేళ్ల క్రితం వైద్యుడిని సంప్రదించిన  షెఫాలీ, ఆ తర్వాత కూడా స్వయంగా మందులు తీసుకోవడం ప్రారంభించి,  ప్రస్తుత వైద్యుల పర్యవేక్షణ లేకుండానే దీనిని కొనసాగించిందనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. 

ఖాళీ కడుపుతో ఇంట్రావీనస్‌గా తీసుకోవడం లేదా ఇతర మందులతో పాటు తీసుకోవడం వంటివి - హైపోటెన్షన్ , కార్డియాక్ అరెస్ట్‌లాంటి ముప్పు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. షెఫాలీ  విషయంలో కూడా ఖాళీ కడుపుతో ఇంజక్షన్ తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు  వచ్చి ఉంటుందని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణపై ఇంకా స్పష్టతలేదు.  పోస్ట్‌మార్టం నివేదిక  తరువాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గ్లుటాతియోన్, విటమిన్ సి చర్మ చికిత్సలలో విస్తృతంగా  వాడుకలో ఉన్నప్పటికీ ఖాళీకడుపుతో లేదా ఉపవాసం ఉన్న స్థితిలో, ఇలాంటి మందుల కలయిక  హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని, ఒక్కోసారి  రక్తపోటు పడిపోయి గుండె ఆగిపోవడానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.  ముఖ్యంగా దేశవ్యాప్తంగా అంతటా యాంటీ-ఏజింగ్ థెరపీల వాడకంపై  వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా, ఇంజెక్ట్ చేయగల గ్లూటాతియోన్‌కు FDA-ఆమోదం లేదనీ, వాస్తవానికి, చర్మాన్ని తెల్లగా చేస్తుందని భావిస్తున్న  గ్లూటాతియోన్‌ ఇంజెక్షన్‌ ఫలితాలపై  క్లినికల్ ట్రయల్స్‌గానీ,  లేదా అధికారిక మార్గదర్శకాలు లేవు. పైగా దీని వలన  కాలేయం, మూత్రపిండాలు , నాడీ వ్యవస్థపై విషపూరిత ప్రభావంతో పాటు, స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన ప్రమాదాలను కూడా FDA లేవనెత్తింది. అలాగే చర్మకాంతికోసం ఇంజెక్టబుల్‌ విటమిన్ సి ఉత్పత్తులకు కూడా FDA-ఆమోదం లేదు. 2019లో, FDA అన్ని కంపెనీలను ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి) ఇంజెక్షన్ అనుమతి లేని వెర్షన్ల పంపిణీని నిలిపివేయాలని కోరింది. 

మరోవైపు   భారతదేశంలో, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) గ్లూటాతియోన్ , విటమిన్ సి ఇంజెక్షన్ల వినియోగానికి  ఆమోదం తెలిపింది. కానీ  సౌందర్య లేదా చర్మాన్ని తెల్లగా చేసే   ఉద్దేశానికి   ఎంతమాత్రం కాదు  నిర్దిష్ట వైద్య సూచనల కోసం మాత్రమే.

కోవిడ్‌ తరువాత ఇటు  దేశంలో, ఆటు ప్రపంచవ్యాప్తంగా  మహిళల్లో మరణానికి హృదయనాళ వ్యాధి (CVD)  ప్రధాన కారణంగా నిలుస్తోందని  రొమ్ము కేన్సర్‌ తరువాత ఇదే అత్యంత ప్రమాదకారిగా ఉందంటున్నారు వైద్య నిపుణులు.

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు