కింగ్‌ ఖాన్‌ గేమ్స్‌ ఆడతాడు

Published on Sat, 07/18/2026 - 06:17

బాలీవుడ్‌లో షారూఖ్‌ ఖాన్‌ టాప్‌ హీరో. కింగ్‌ ఖాన్‌ అంటూ తెరపై షారూఖ్‌ కనపడితే అభిమానులు ఒళ్లు మరచిపోతారు. షారుఖ్‌ ఖాన్‌ వీడియో గేమ్స్‌ అంటే ఒళ్లు ఇల్లు కూడా మరచిపోతారు. ఆయన టాప్‌ యాక్టర్‌ అని దేశమంతా తెలుసు కానీ ఆయన బెస్ట్‌ వీడియో గేమర్‌ అని తక్కువ మందికే తెలుసు. సిక్స్‌ టీ ఏజ్‌లోనూ సిక్స్‌ప్యాక్‌ తో స్క్రీన్‌ను మెరిపించేందుకు ఎంత కష్టానికైనా సై అనే ఈ సూపర్‌స్టార్, విశ్రాంతి తీసుకోవడానికి కూడా వినోదాన్నే ఎంచుకుంటారు. 

అందులో భాగంగా తాను బాట్‌మాన్‌: ఆర్కమ్‌ ఆరిజిన్స్ వంటి ప్రసిద్ధ గేమ్‌లు ఆడతానని తరచుగా ఆయన చెబుతారు. ఏదో రిలాక్సేషన్‌ కోసం వీడియో గేమ్స్‌ ఆడితే ఆయన హాబీ గురించి చెప్పుకోవాల్సింది ఏమంది? కానీ ఆయన ముంబై లోని అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటైన ఆయన ఇల్లు ’మన్నత్‌’లో ఒక అంతస్తు మొత్తాన్ని గేమింగ్‌ పరికరాలు సెటప్‌ల కోసం కేటాయించారు కాబట్టే ఆయన హాబీ హాట్‌ టాపిక్‌ అవుతుంటుంది.

సాటి హీరోలతోనూ... సినిమాల్లోనూ సాటి హీరోలతో తీవ్రమైన పోటీతత్వానికి ప్రసిద్ధి చెందిన ఆయన తరచుగా అభిషేక్‌ బచ్చన్, కాజోల్‌ వరుణ్‌ ధావన్‌ వంటి సహనటులతో షూటింగ్‌ల మధ్య గేమ్‌లు ఆడుతూ పోటీ పడుతూ తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు.. ఆయన ఉత్సాహం ప్రోత్సాహంగా మారి తరచుగా తోటి నటులపై కూడా తన ప్రభావం చూపింది. దానికో ఉదాహరణ ఆయన సహనటుడు సోనూ సూద్‌. 

ఒకసారి సెట్‌లో షూటింగ్‌ గ్యాప్‌లో షారూఖ్‌ ఖాన్‌ ద్వారా గేమింగ్‌ నేర్చుకున్న సోనూ ఇప్పుడు దానికి తాను కూడా బానిస అయ్యా నంటున్నాడు. ’మై హూ నా’ షూటింగ్‌ సమయంలో షారుఖ్‌ ఉత్సాహంగా... ఫిఫా ఆడేవారని, ఆడేవారని గెలిచే వరకు గేమింగ్‌ కొనసాగించాలని పట్టుబట్టేవారని షూటింగ్‌ సమయంలో జాయెద్‌ ఖాన్‌ వంటి సహనటులు తరచు గుర్తుచేసుకుంటారు. జాయెద్‌ ఖాన్‌ ఇటీవల ’మై హూ నా’ సెట్‌లో షారుఖ్‌ ఖాన్ తో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను పంచుకుంటూ, షూటింగ్‌ తర్వాత తాము తరచూ కలిసి వీడియో గేమ్‌లు ఎలా ఆడేవారో గుర్తుచేసుకున్నారు.

 ఆయనకు ఉన్న వీడియో గేమ్‌ అభిరుచి గాఢతను సోదాహరణంగా వెల్లడిస్తూ ఎస్‌ఆర్‌కే ఒక అంకితభావం గల గేమర్‌ అని, ముఖ్యంగా ఫీఫా 2000 గేమ్‌లో ఓడిపోవడాన్ని ఆయన ఇష్టపడరనే విషయాన్ని జాయెద్‌ పంచుకున్నారు. గేమింగ్‌ పట్ల ఆయనకున్న అభిరుచి బయటివారిని మాత్రమే కాదు ఆయన ఇంటివారిని కూడా ఓ ఆట ఆడిస్తోంది. ఆయన చిన్న కొడుకు అబ్రమ్‌ని కూడా గేమ్‌ లవర్‌గా మార్చేసింది. తన ఇద్దరు అబ్బాయిలు గేమింగ్‌ లో లీనమైన ఫొటోని ఆయన భార్య గౌరీఖాన్‌ని అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఆధారిత వీడియో గేమ్స్‌ రావడానికి కూడా రావణ్, డాన్‌ 2, చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వంటి సినిమాలు దోహదం చేశాయి. 

– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్‌
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)