Breaking News

జూన్‌ 13 : స్పెషాల్టీ ఏంటో తెలిస్తే, వావ్‌..! అనాల్సిందే!

Published on Thu, 06/13/2024 - 11:32

Sewing Machine Day 2024 జాతీయ కుట్టు  మెషీన్‌ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 13న జరుపుకుంటారు.  ఏంటి ఇదొక డే  కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? ఉంది.. దీని కథా కమామిష్షు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆది మానవుడు ఆకులు, నార వస్త్రాలు కట్టుకుని తిరిగేవాడని చరిత్ర చెబుతోంది.  పరిణామ క్రమంలో వస్త్రధారణలో అనేక పరిణామా లొచ్చినప్పటికీ, కుట్టుయంత్రాన్ని తయారు చేయడం విప్లవాత్మకమైన పరిణామమని చెప్పవచ్చు. వీటన్నింటికి మాతృక కుట్టుమెషీన్‌ను కనుగొనడమే.  అలా 1790లో కుట్టు మెషీన్‌ ఆవిష్కరణ సందర్భాన్ని జాతీయ కుట్టు యంత్ర దినోత్సవంగా జరుపుతారు.   

ఆంగ్ల ఆవిష్కర్త థామస్ సెయింట్  దీనికి పేటెంట్‌ తీసుకున్నారు. కానీ థామస్ కుట్టు యంత్రం  రూపకల్పన ముందుకు సాగలేదు. దీని తొలి నమూనా 1874లో  తయారైంది. విలియం న్యూటన్ విల్సన్ అనే వ్యక్తి లండన్‌లోని పేటెంట్ కార్యాలయంలో సెయింట్  డ్రాయింగ్‌లను గుర్తించారు. ఈ డిజైన్‌కు కొన్ని సర్దుబాట్లు చేసి వర్కింగ్ మోడల్‌ను రూపొందించారు ఈ నమూనా ఇప్పుడు లండన్ సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. అయితే 1800ల తరువాత  కుట్టు యంత్రాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.

ఎలియాస్ హోవే ,ఐజాక్ సింగర్  కుట్టు యంత్రాలను అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆ తరువాత సామాన్య మానవుడికి కుట్టు మెషీన్లు అందుబాటులో వచ్చాయి. ఆ తరువాత అనేక కంపెనీలకు చెందిన, మెషీన్లు ఆధునిక హంగులతో అందుబాటులోకి వచ్చాయి. విభిన్న డిజైన్లతో ఫ్యాషన్‌ ప్రపంచం పరుగులు తీయడానికి, కుట్టుకళకు ఇంత ప్రాధాన్యత రావడానికి కారణమైన కుట్టు యంత్రాల ఆవిష్కారం, చరిత్ర గురించి తెలుసు కోవడం చాలా అవసరం.
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)