Breaking News

భారత ఆర్మీ ఆఫీసర్‌గా సెక్యూరిటీ గార్డ్ కుమార్తె ..!

Published on Wed, 01/07/2026 - 17:28

ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోతేనేం.. ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలనే కలను కనొచ్చు, నిజం చేసుకోవచ్చు. అందుకు పరిమితులు అనేవి ఎన్నటికి అడ్డంకి కావు అని నిరూపించింది ఓ సెక్యూరిటీ గార్డు కుమార్తె. పైగా చిన్న వయసులోనే భారత ఆర్మీ ఆఫీసర్‌ అయ్యి.. అరుదైన రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈశాన్య భారతదేశం నుంచి  ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయిగా నిలిచింది. ఎవరా ఆ అమ్మాయి..? ఏమా కథ..? చకచక చదివేయండి మరి...

ఆ అమ్మాయే మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని రాలూనామీ గ్రామానికి  చెందిన ఎనోని. ఆమె మాఓ నాగా అనే గిరిజన తెగకు చెందింది. ఈ తెగకు చెందిన ప్రజలు మణిపూర్‌, నాగాలాండ్‌ అంతటా ఉంటారు. ఇక ఎనోని తండ్రి ఒక ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డు.  తన తండ్రి జీతంపైనే ఆరుగురు పిల్లలు చదువు, పోషణ చూసుకోవాల్సి ఉండేది. ఎనోని ఆ ఆరుగురిలో ఆఖరి అమ్మాయి. 

అయితే ఆమె తల్లిదండ్రులు ఇంట్లో ఎంతటి దారిద్యం తాండవించినా..వారి చదువుల విషయంలో ఎప్పుడు రాజీ పడకుండా తమకు చేతనైంనతలో చదివించే యత్నమే చేశారు. ఇక ఎనోని ఆర్మీ వైపుకి ఎలా వచ్చిందంటే..

ఎమనిదో తరగతి నుంచే మొదలు..
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో మహిళలు ఎక్కువగా పాల్గొనడానికి అనుమతించబడిన సమయంలోనే ఎనోనికి భారత సైన్యంలో చేరాలనే ఆకాంక్ష ఉంది. సాయుధ దళాల క్రమశిక్షణ, యూనిఫాం అంటే మహా ఇష్టం. ఆ యునిఫాంని ఎప్పుడు ధరిస్తానా అని అనుకునేది. ఆమె పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఎన్‌సీసీలో చేరింది.

తర్వాత NCC సీనియర్ వింగ్ శిక్షణను కొనసాగించడానికి ఢిల్లీకి వెళ్లింది. ఒక మారుమూల గ్రామానికి చెందిన యువతికి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన అడుగు. ప్రతి అడుగు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది..అయినా తన సంకల్ప బలాన్ని వదులుకునేది కాదు. 

తండ్రి లాఠీ తనకు ఖడ్గంగా ..
కఠినమైన శిక్షణ సమయంలో అలసట లేదా విసుగు వచ్చినప్పుడల్లా.. ఎనోని తన తండ్రి త్యాగాలను గుర్తు చేసుకుంటూ..ముందుకు నడిచేది. అతను చేతిలో లాఠీతో చల్లని రాత్రులలో కాపలాగా నిలబడి ఉండగా..తాను ఏదో ఒక రోజు కత్తిని చేత ధరించి భారతీయ సైనిక అధికారిగా భుజాలపై నక్షత్రాలు ధరించాలనే ఆశతో అవిశ్రాంతంగా శిక్షణ తీసుకుంది. ముందు ఇండియన్‌ మిలటరీ అకాడమీ(ఐఎంఏ)లో కఠినమైన శిక్షణలో విజయం సాధించింది. 

ఆ తర్వాత ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో మాత్రం కాస్త ఒత్తిడికి గురైంది. ఎందుకంటే ఇక్కడ అత్యంత కఠినమైన శిక్షణ ఉంటుంది. శారీరకంగా, మానసికంగా భావోద్వేగపరంగా కఠినమైన శిక్షణను పూర్తి చేయడం అత్యంత కష్టతరం. అయినప్పటికీ ఎనోని అద్వితియంగా పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ పూర్తి చేసుకుని.. చివరికి అధికారిక యూనిఫాం ధరించి డ్రిల్‌ స్క్వేర్‌పై కవాతు చేస్తూ..అనుకున్న లక్ష్యాన్ని సాధించా అంటూ ఒక విధమైన ఉద్విగ్నానికి గురయ్యేది. 

ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు ఒక చరిత్రగా మారింది. ఎందుకంటే తన మావో నాగ కమ్యూనిటీ నుంచి అధికారణిగా భారత ఆర్మీ నయూనిఫాం ధరించిన తొలి మహిళ ఆమె. అలాగే ఈశాన్య భారతదేశం నుంచి ఆర్మీకి నాయకత్వం వహించిన తొలి తొలి మహిళ కూడా ఎనోనినే కావడం విశేషం.

(చదవండి: ధైర్యానికి కేరాఫ్‌ ఆమె..! ఏకంగా 24 దేశాలు..)
 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)