శాంతి సయోధ్యల సంబరం

Published on Sun, 06/21/2026 - 00:08

పురాతన సంస్కృతికి అద్దం పట్టే సెబీబా ఉత్సవాలకు అల్జీరియాలోని జానేట్‌ నగరం సన్నద్ధమవుతోంది. అల్జీరియా టూర్స్‌ పర్యవేక్షణలో జూన్‌ 20 నుంచి 27 వరకు వారం రోజులు సాగే ఈ ప్రత్యేక సాంస్కృతిక జాతర సరికొత్త అనుభూతిని పంచుతుంది. పరస్పర వైరం ఉన్న తెగల మధ్య కుదిరిన చరిత్రాత్మక సయోధ్యకు, శాంతి ఒప్పందానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవం యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. సహారా ఎడారి ప్రజల అస్తిత్వ రూపం సెబీబా వేడుకలు.

మూడువేల ఏళ్ల కిందట స్థానిక తెగల మధ్య జరిగిన సుదీర్ఘమైన, భీకరమైన యుద్ధాల ముగింపునకు, ఇరు వర్గాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి ఒక సజీవ సాక్ష్యం ఈ ఉత్సవాలు. యుద్ధంపై శాంతి సాధించిన విజయమే ఇందులోని ప్రధాన సందేశం. అలాగే ఇక్కడి ఆచారాలు శక్తికి, సౌందర్యానికి మధ్య ఉన్న సమతుల్యతను ప్రతిబింబిస్తాయి. పురుషులు తరతరాల నాటి తువారెగ్‌ దుస్తులు, తలపాగాలు ధరించి, చేతుల్లో కత్తులు పట్టుకుని వీరత్వంతో కూడిన నృత్యాలు చేస్తారు. ఇవి కేవలం నృత్యాలు కావు, పూర్వపు తెగల మధ్య జరిగిన యుద్ధాలను తలపించే ప్రతీకాత్మక ప్రదర్శనలు. అలాగే మహిళలు ప్రత్యేకమైన లయతో కూడిన డప్పు చప్పుళ్లతో, గంభీరమైన గీతాలను ఆలపిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. 

ఈ ఉత్సవం స్థానిక తువారెగ్‌ కళాకారులకు, చేతివృత్తుల వారికి పెద్ద ఉపాధి మార్గం కూడా! స్థానిక హస్తకళాకారులు తయారుచేసే కత్తులు, వెండి ఆభరణాలు, ప్రత్యేక దుస్తులు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పర్యాటకులు స్థానిక మార్కెట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. సహారా ఇసుక తిన్నెల మధ్య, ప్రాచీన రాతి శిల్పాల నీడలో, పూర్వీకుల సంస్కృతిని నేటికీ సజీవంగా ఉంచుతున్న తువారెగ్‌ పౌరుల ‘సెబీబా’ ఉత్సవం, మానవజాతికి ఒక అపురూపమైన సాంస్కృతిక కానుక. వారి ఆత్మగౌరవానికి, సామూహిక స్మృతికి ప్రతీక ఈ వేడుకలు.

వారం రోజుల పర్యటన
1. (జూన్‌ 20 – శనివారం): రాత్రి 9:55 గంటలకు అల్జీర్స్‌ రాజధాని నుంచి నేరుగా విమాన ప్రయాణం. అర్ధరాత్రి 0:10 గంటలకు జానేట్‌ చేరుకుంటారు. 
2. (జూన్‌ 21 – ఆదివారం): ‘ఇహెరిర్‌ లోయ’ సందర్శన. ఎడారి ఓసిస్‌ నీటిలో ఈత కొట్టే అవకాశం. 
3. (జూన్‌ 22 – సోమవారం): ఇథారెన్‌ పురాతన సంచార గ్రామం సందర్శన. 

4. (జూన్‌ 23 – మంగళవారం): ఎస్సెండైలీన్‌ వ్యాలీ గుండా పాదయాత్ర, ఇసుక రాతి తోరణాల సందర్శన. రాత్రి ఎల్‌ మిహాన్‌ ప్రాంతంలో జరిగే ‘డౌఘియా’ రిహార్సల్‌ వీక్షణ.
5. (జూన్‌ 24 – బుధవారం): ఇమెరౌడెన్‌ రాతి చిత్రాల పరిశీలన. రాత్రి జెలౌజ్‌ తెగ ‘తిమౌలావీన్‌’ యుద్ధ నృత్యాల రిహార్సల్స్‌ వీక్షణ.
6. (జూన్‌ 25 – గురువారం): ముగింపు వేడుక – సెబీబా ఫెస్టివల్‌. తువారెగ్‌  సంస్కృతికి అద్దం పట్టే అద్భుత నృత్యాలు, ఆభరణాల ప్రదర్శన.

7. (జూన్‌ 26 – శుక్రవారం): ఎర్గ్‌ అద్మెర్‌ ఇసుక దిబ్బల మధ్య 7,000 ఏళ్ల నాటి ‘ది వీపింగ్‌ కౌ’ రాతి శిల్పం వీక్షణ. అడాయిక్‌ రాతి అడవి, పురాతన కోటలు, జానేట్‌ మ్యూజియం సందర్శన.
8. (జూన్‌ 27 – శనివారం): అర్ధరాత్రి దాటాక 2:15 గంటలకు జానేట్‌ నుంచి తిరుగు ప్రయాణం. ఉదయం 5:55 గంటలకు అల్జీర్స్‌ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)