Breaking News

ఆరోజు ఆ అర్ధరాత్రి ఏం జరిగిందో తెలుసా?!

Published on Tue, 11/11/2025 - 00:39

హేమాంగిని దత్‌ మజుందార్‌ పుస్తకాలలో స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఆసక్తిగా చదివేలా చేస్తాయి. ఆమె తాజా పుస్తకం స్క్రాచ్‌ అండ్‌ స్నిఫ్‌ క్రానికల్స్‌... బెంగాలీ అయిన హేమాంగిని మజుందార్‌ కోల్‌కతాతో పాటు ముంబై, న్యూయార్క్, ఆస్టిన్, బహ్రెయిన్‌లలో నివసించింది. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటుంది. బెంగాలీ వంటకాలతో పాటు ఎన్నో వంటకాలపై ఆమెకు అవగాహన ఉంది.

‘నాకు ఒక ప్రదేశంలో ఆహారం సౌకర్యవంతంగా ఉంటే, ఆ ప్రదేశంలో నేను నిజంగా స్థిరపడ్డానని అనుకుంటాను. బెంగాలీ సంచారిగా ఆహారం అనేది నా మూలాలను, ఇంటిని గుర్తు తెస్తుంది. నేను ఏదైనా నగరాన్ని విడిచి వెళుతున్నప్పుడు ఇంట్లో కొంత భాగాన్ని వదిలి వెళుతున్నట్లు అనిపిస్తుంది’ అంటుంది మజుందార్‌. ఆహారం అనేది ఆమె రచనాప్రక్రియలో భాగం అయింది. ఆహారపదార్థాలతో భావోద్వేగ బంధం ఆమెను పుస్తక రచనకు పురికొల్పింది. 

హేమాంగిని పుస్తకం చదివిన వాళ్లు... ‘పుస్తకం చదివినట్లుగా లేదు. విందు ఆరగించినట్లుగా ఉంది’ అంటారు చమత్కారంగా. వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆ కాలాన్ని తన రచనల్లోకి తీసుకురావడం అంటే మజుందార్‌కు ఇష్టం. ‘ది స్క్రాచ్‌ అండ్‌ స్నిఫ్‌ క్రానికల్స్‌’ అలాంటి రచనే. చారిత్రాత్మక పట్టణం నేపథ్యంగా సాగే నవల. చందానగర్‌ అనేది ఒకప్పుడు  కోల్‌కతా వెలుపల ఫ్రెంచ్‌ కాలనీగా ఉండేది. వోలీ ఛటర్జీ అనే మహిళ చందానగర్‌లో తన పూర్వీకులకు చెందిన ఎస్టేట్‌లో నివసించడానికి వెళుతుంది. అక్కడ ఒక అర్ధరాత్రి ఆమెకు వింత అనుభవాలు ఎదురవుతాయి.

వోలి తనకు ఉన్న ప్రత్యేక శక్తులతో ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడుతుంది. ‘మహిళలు ఎదుర్కొంటున్న అదృశ్య యుద్ధాలు’ అంశంపై ‘ది స్క్రాచ్‌ అండ్‌ స్నిఫ్‌ క్రానికల్స్‌’ రాసింది హేమాంగిని మజుందార్‌.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)