Breaking News

పిల్లల్ని ఎప్పుడు కనాలి? సైంటిస్టులు తేల్చేశారు.. అదే సరైన సమయమట

Published on Fri, 07/07/2023 - 12:57

30ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని వాళ్లు చాలామందే ఉన్నారు. పెళ్లెప్పుడు అని అడిగితే.. అప్పుడేనా? ఏమిటంత తొందర అన్నట్లు సమాధానమిస్తుంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీది ప్లానింగ్ చేసుకోక తప్పదు. పెళ్లి దగ్గర్నుంచి చివరకు పిల్లల విషయంలో కూడా ప్లానింగ్‌తోనే ఉంటున్నారు ఈ కాలం దంపతులు. పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా  వాళ్ల దగ్గర ఓ థియరీ ఉంటుంది.

కానీ వయసైపోయాక  పిల్లల్ని కనాలంటే డెలీవరీకి ఇబ్బందులుంటాయని, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం.. పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఏంటన్నది నిర్థారించారు.


ఈ జనరేషన్‌లో భార్యభర్తలిద్దరూ రెండుచేతులా సంపాదించడానికి పెట్టిన శ్రద్ధ ఫ్యామిలీ ప్లానింగ్‌పై పెట్టడం లేదు. లైఫ్‌లో సెటిల్ అయ్యాక‌ తీరిగ్గా పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చులే అని లైట్‌ తీసుకుంటారని వైద్యులు తెలియజేస్తున్నారు. వాస్త‌వానికి ఏ వయసులోపు కనాలి అనే విషయంపై చాలా మంది దంపతుల్లో క్లారిటీ ఉండదు. ఇప్పుడే ఏం తొందర వచ్చిందిలే అని అనుకుంటారు. కానీ పిల్లల్ని కనేందుకు మహిళలకు 23 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయసు సరైన సమయం అని సైంటిస్టులు వెల్లడించారు.

ఈ వయసులో బిడ్డలకు జన్మనిస్తే అసాధారణ పిండాలు లాంటి నాన్‌క్రోమోజోమల్‌ వంటి ఇష్యూస్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. 32 ఏళ్ల తర్వాత మహిళలు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది.

ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం, జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. 32 దాటాక పిల్లల్ని కంటే డెలీవరీ సమయంలో నాడీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువని హంగేరి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)