Breaking News

మనిషి బ్రెయిన్‌ వేవ్స్‌తో..ఏకంగా "పాట"..

Published on Thu, 08/17/2023 - 12:52

మనిషి తన టాలెంట్‌ని వెలకితీసి మరీ రకరకాలుగా సంగీతాన్ని సృష్టిస్తున్నాడు. తన గాత్రంతో లేదా తన అవయవాలతో రకరకాల విన్యాసాలు చేసి మరి సృష్టించడం చూశాం. మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా మ్యూజిక్‌ని  సృష్టించడం గురించి విన్నారా!. ఔను తాజాగా సైంటిస్టులు ఆ కొత్త విషయాన్ని కనిపెట్టారు. కేవలం మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా సంగీతాన్ని పునర్నిర్మించారు. అందుకు అమెరికాలోని బర్కలీలో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకుల బృందం మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. 1979 నాటి పింక్ ఫ్లాయిడ్ మూవీలోని క్లాసిక్‌ పాట "అనదర్‌ బ్రిక్‌ ఇన్‌ ది వాల్‌" పాటను మూర్చ రోగులకు వినిపించారు. ఆ సమయంలో వారి మెదడులో ఉత్ఫన్నమయ్యే సంకేతాల ను పదాలుగా అర్థమయ్యేలా ప్రసంగంగా మార్చి పునర్నిర్మించడంలో విజయవంతమయ్యారు పరిశోధకులు.

తొలిసారిగా శాస్త్రవేత్తలు బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌లను(బీసీఐ) ఉపయోగించి సంగీతాన్ని పునః సృష్టించారు. 2009 నుంచి 2015 మధ్య న్యూయార్క్‌లోని అల్బానీ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స పొందిన దాదాపు 29 మంది మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. గాయకుడు వాల్టర్స్‌ పాడిన "అనదర్‌ బ్రిక్‌ ఇన్‌ ది వాల్‌" పాటను  ఆ రోగుల ముందు ప్లే చేసేటప్పుడే వారి మెదడులకు ఎలక్ట్రోడ్‌లను అమర్చారు. అవి బ్రెయిన్‌లో సంగీతానికి స్పందించే సంకేతాలను ఎన్‌కోడింగ్‌ చేసింది. ఆ తర్వాత డేటాను అర్థ చేసుకునేందుకి రిగ్రెషన్‌ ఆధారిత నమునాలను ఉపయోగించారు.

తద్వారా స్పెక్ట్రోగ్రామ్‌(పాట)ను పునః సృష్టిచగలిగారు. మెదడు సంకేతాలు ఎలా ఫ్రీక్వెన్సీలుగా మారతాయో తెలుపుతోంది ఈ ఆడియో ఫైల్‌. మెదడు సంగీత శ్రావ్యత, లయ, ఒత్తిడి, స్వరం, ధ్వని వంటి అంశాలన్నింటినికి మెదడు నుంచి వచ్చే తరంగాలను ఎలా అర్థవంతమైన పదాలుగా మలిచి పాటను పునర్నిర్మించొచ్చు అనేది ఈ అధ్యయనంలో వెల్లడైందన్నారు శాస్తవేత్తలు. ఇది భవిష్యత్తులో జరిగబోవు మెదడు ఇంప్లాంటేషన్‌ శస్త్రచికిత్సలకు సంగీతం ఉపకరిస్తుందని ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు శాస్త్రవేత్తలు. అయినా ఇప్పటికే వైద్యులు కొంతమంది రోగులకు బ్రెయిన్‌కి సంబంధించిన శస్త్ర చికిత్సల కోసం వారికి నచ్చిన మ్యూజిక్‌ని ప్లే చేసి మరి ఆపరేషన్‌లు చేసిన ఉందంతాలను చూశాం. 

(చదవండి: పూజారి కమ్‌ బైక్‌ రేసర్‌.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)