Breaking News

బట్టతలపై జుట్టు.. ‘మ్యాజిక్ క్యాప్’తో ఊహకందని అద్భుతం!

Published on Fri, 02/20/2026 - 07:36

జుట్టు రాలడం అనేది ఇక గతం.. బట్టతల సమస్యకు కాలం చెల్లింది. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు నూతనంగా ఆవిష్కరించిన ‘స్మార్ట్ క్యాప్’ ధరిస్తే చాలు.. రాలిపోయిన జుట్టు మళ్లీ వచ్చేస్తుంది. జుట్టు వృద్ధాప్యానికి కారణమయ్యే ఎంజైమ్‌లను ఏకంగా 92 శాతం వరకు తగ్గించే వినూత్న ‘లైట్ థెరపీ’ టెక్నాలజీతో ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నారు ‘కైస్ట్‌’ పరిశోధకులు. ఇటు మందులు లేవు, అటు సైడ్ ఎఫెక్ట్స్ లేవు.. కేవలం కాంతి కిరణాల మాయాజాలంతో జుట్టు కుదుళ్లకు తిరిగి ప్రాణం పోసే ఈ అద్భుత ఆవిష్కరణ వివరాలు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా చర్చ
వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న బట్టతల సమస్యకు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కనుగొన్న విప్లవాత్మక పరిష్కారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాశంగా నిలిచింది. ‘స్మార్ట్ క్యాప్’తో రాలిపోయిన జుట్టు మళ్లీ చిగురిస్తుందని వారు నిరూపిస్తున్నారు.

92 శాతం ఫలితం.. పరిశోధనలో సంచలనం
దక్షిణ కొరియాలోని ప్రముఖ కొరియా అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(కైస్ట్‌) పరిశోధకులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. వారు రూపొందించిన ప్రత్యేక లైట్ థెరపీ ద్వారా జుట్టు వృద్ధాప్యానికి కారణమయ్యే మార్కర్లు ఏకంగా 92 శాతం తగ్గినట్లు గుర్తించారు. ఈ వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్ కమ్యూనికేషన్స్'లో ప్రచురితం కావడంతో ప్రపంచమంతా ఈ పరిశోధనలపై దృష్టి సారించింది.

అసలు కారణంపై పరిశోధనలు చేసి..
జుట్టు ఎందుకు రాలుతుంది? వయసు పెరిగే కొద్దీ జుట్టు కుదుళ్లలో ‘బీటా-గెలాక్టోసిడేస్’ అనే ఎంజైమ్ పెరుగుతుంది. ఇది కణాల వృద్ధాప్యానికి సంకేతం. కొరియన్ శాస్త్రవేత్తలు నేరుగా జుట్టు మొదళ్లలో ఉండే ‘హ్యూమన్ డెర్మల్ పాపిల్లా’ కణాలపై దృష్టి సారించారు. ఈ కణాలను ఉత్తేజితం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని వారు కనుగొన్నారు.

నియర్-ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ సాయంతో..
ఈ చికిత్సలో 730 నుండి 740 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం కలిగిన ‘నియర్-ఇన్‌ఫ్రారెడ్’ కాంతిని వినియోగించారు. ఈ ప్రత్యేక కాంతి కిరణాలు చర్మం లోపలికి చొచ్చుకుపోయి, నిద్రాణంగా ఉన్న జుట్టు కుదుళ్లను మేల్కొల్పుతాయి. ప్రయోగశాల పరీక్షల్లో, ఈ కాంతి సోకిన కణాలు సాధారణ కణాల కంటే ఎంతో ఆరోగ్యంగా, యవ్వనంగా మారినట్లు తేలింది.

కాంతి ప్రసారంతో అద్భుతం
గతంలో కూడా ఇలాంటి లేజర్ హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి బరువుగా, అసౌకర్యంగా ఉండేవి. అయితే కైస్ట్‌ శాస్త్రవేత్తలు ఫ్లెక్సిబుల్ ఓఎల్‌ఈడీ (వంగే గుణం ఉన్న లైట్లు) టెక్నాలజీని వాడారు. ఇది చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. దీనిని మనం రోజూ పెట్టుకునే టోపీలో కూడా అమర్చుకోవచ్చు. ఇది తల ఉపరితలానికి పూర్తిగా అంటుకుని ఉండి, కాంతిని సమానంగా ప్రసరింపజేస్తుంది.

సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స
ప్రస్తుతం జుట్టు కోసం వాడే మినోక్సిడిల్ లేదా ఫినాస్టరైడ్ వంటి మందుల వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ లైట్ థెరపీ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు వాడనవసరం లేదు. అందుకే ఇది అత్యంత సురక్షితమైన,  ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

క్లినికల్ ట్రయల్స్ దిశగా..
ప్రస్తుతానికి ఈ ప్రయోగాలు ల్యాబ్ స్థాయిలో విజయవంతమయ్యాయి. త్వరలోనే వీటిని మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, మార్కెట్లోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీ గనుక అందుబాటులోకి వస్తే, బట్టతల అనేది ఇక భవిష్యత్తులో కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కానున్నదనడంలో సందేహం లేదు.

ఇది కూడా చదవండి: ‘నేషనల్ ఏఐ ప్లాన్‌’తో దూకుడు..

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)