Breaking News

పిడుగులకీ... అర్జునుడికీ సంబంధం ఏమిటి?

Published on Mon, 11/16/2026 - 01:08

ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు పిడుగులు పడుతున్నప్పుడు అర్జునా.. ఫాల్గుణ.. పార్ధా... అంటూ అర్జునునికుండే 10 నామాలు స్మరించుకొంటాం. అసలు అర్జునునికి పిడుగులకు సంబంధం ఏమిటి? పిడుగులు పడేటప్పుడు అర్జునుని పేర్లే ఎందుకు తలచుకోవాలి..? వాటి వెనక ఉన్న నమ్మకం, శాస్త్రీయ కోణం ఏమిటి...? 

పాండవుల అరణ్యవాసం పూర్తయిన తర్వాత విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం గడిపారు. అక్కడ అర్జునుడు మారువేషంలో బృహన్నలగా విరాటరాజు కుమార్తె ఉత్తరకు నాట్య శిక్షకుడిగా ఉన్నాడు. పాండవులు విరాటరాజు కొలువులో ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న కౌరవులు విరాటరాజు రాజ్యంపై దండెత్తారు. రాజకుమారుడైన ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరగా బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు రథసారథిగా వ్యవహరించాడు. 

లక్షల సంఖ్యలో ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి భీతిల్లిన ఉత్తర కుమారుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు, తాను ఎవరో తన అసలు పేరు ఏమిటో చెప్పి శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకొని రమ్మని చెబుతాడు. ఆయుధాలు పాము ఆకారంలో కనబటంతో భయపడిన  ఉత్తర కుమారుడు అర్జునుడు అంటే మహా పరాక్రముడు...అతనికి 10 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు వాటి అర్థాలు కూడా చెప్పమని కోరాడు. ఆ 10 పేర్లను ఈ కిందివిధంగా చెప్పి ఉత్తరకుమారుని భయాన్ని పోగొట్టాడు. అర్జున, ఫల్గుణ, పార్ధ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ.... అని పది పేర్లను బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు చెప్పాడు. ఈ పేర్ల అర్థాలు ...

1. అర్జున... స్వచ్ఛమైన తెల్లని లేదా పాపం లేనివాడని..
2. ఫల్గుణ ... ఉత్తర, పూర్వ ఫల్గుణి నక్షత్రాల సంధి కాలంలో జన్మించడం వల్ల ఫల్గుణుడు 
3. పార్ధ ....అర్జునుని తల్లి కుంతీదేవి అసలు పేరు పృథ ఆమెకు జన్మించటంతో పార్థుడని.....
4.కిరీటి... దేవతలరాజైన ఇంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వల్ల కిరీటి. 
5.శ్వేత వాహన.... తెల్లని గుర్రాలను పూన్చిన రథాన్ని కలిగి ఉండటం వల్ల ....
6. బీభత్స... అర్జునుడు యుద్ధం చేసే విధానం బీభత్సంగా ఉండటంతో బీభత్సుడని...
7.విజయుడు... ఎల్లపుడూ విజయాన్ని పొందేవాడు కాబట్టి .
8.సవ్యసాచి... రెండు చేతులతో ధనుర్భాణాలు సంధించేవాడు కాబట్టి ....
9. కృష్ణ అంటే నల్లని మేని ఛాయ కలిగి ఉండటం వల్ల... కృష్ణుడికి ప్రాణమిత్రుడు అవడం వల్ల అలా పిలుస్తారు.
10. ధనుంజయ అంటే... ధనం పై మోజు లేని వాడు కాబట్టి ధనుంజయుడని పిలుస్తారు.

ఇంతకు ఈ పదిపేర్లలో రెండవ పేరు అయిన ఫల్గుణకు పిడుగులకు సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఉత్తర, పూర్వ ఫల్గుణ నక్షత్రాల సంధి కాలంలో అర్జునుడు జన్మించడం వల్ల పిడుగులను అదుపు చేయగలడని అందుకే పిడుగులు పడుతున్నప్పుడు అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి.. అంటూ అర్జునుని పది పేర్లు మననం చేసుకుంటూ ఉంటాము.

– సి.ఎన్‌. మూర్తి
సీనియర్‌ పాత్రికేయులు.  

 

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)