Breaking News

Plastic Water bottles : అవసరమా.. ఆకర్షణీయమా!

Published on Wed, 06/04/2025 - 10:32

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ హస్తభూషణంగా మారింది వాటర్‌ బాటిల్‌.  మన చేతుల్లో ఉండే వస్తువుల్లో ముఖ్యమైనదిగా ఈ బాటిల్స్‌ మారాయి. పనిలో పనిగా గుళ్ల నుంచి జిమ్‌ వరకూ, స్కూల్‌ బ్యాగ్‌ నుంచి కార్‌ కోల్డ్‌ బాక్స్‌ వరకూ ప్రతిచోటా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ సర్వసాధారణం అయ్యాయి. జెన్‌ జీ భాషలో చెప్పాలంటే ఒక ‘లైఫ్‌స్టైల్‌ స్టేట్మెంట్‌’గా అయిపోయింది. ప్లాస్టిక్‌ బాటిళ్లు విభిన్న డిజైన్లలో లభ్యమవుతుండటంతో మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం స్కూల్స్‌ పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో నగరంలో అధిక సంఖ్యలో ఈ ప్లాస్టిక్‌ బాటిల్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఈ బాటిళ్ల వల్ల కలిగే ఆనారోగ్య, పర్యావరణ సమస్యలు వెంటాడుతున్నాయి. దీనిపై విస్తృత ప్రచారం ఉన్నప్పటికీ డిజైన్స్‌కి ఆకర్షితులవుతూ.. వివిధ రకాల రోగాలకు చేరువవుతున్నారు.  –సాక్షి, సిటీబ్యూరో 

 

ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉండటమే కాకుండా, రకరకాల రంగులు, డిజైన్‌లు, కార్టూన్‌ క్యారెక్టర్లు, గ్లిట్టర్‌ ఎఫెక్ట్స్‌తో అందరి మనసు దోచేస్తున్నాయి. ప్రత్యేకించి చిన్నపిల్లలు అవి చూసి వాటిపై మక్కువ పెంచుకుంటున్నారు. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్‌ పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లల కోసం బాటిల్స్‌ కొనుగోలు ఎక్కువగా జరుగుతోంది. దీంతో పాటు మార్కెట్‌లో పిల్లల కోసం వివిధ మోడళ్లు అందుబాటులో ఉండటంతో కొందరు ఒకటికి మించి బాటిళ్లను వినియోగిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశంతో పిల్లలు అడిగినట్లు రెండు మూడు రకాలు కొని పెడుతున్నారు. 

ఇదీ చదవండి: Obesity పోషకలోపం.. ఊబకాయం!

ప్లాస్టిక్‌ అనేది సహజంగా కుళ్లని పదార్థం. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఒకసారి భూమిలో పడితే దాదాపు 450 ఏళ్ల పాటు మట్టిలో కలిసిపోవు. హైదరాబాద్‌ నగరంలో ప్రతి రోజు వేల సంఖ్యలో వినియోగించిన బాటిల్స్‌ పారేస్తున్నారు. వీటిలో మళ్లీ రీసైకిల్‌ అవ్వడం చాలావరకూ జరగకపోవడం వల్ల, ఈ ప్లాస్టిక్‌ వాడకం అత్యధిక వ్యర్థంగా మారుతోంది. నగర శుభ్రతపై కూడా ప్రభావం చూపుతోంది. 

పర్యావరణానికి భారంగా ప్లాస్టిక్‌.. 
పిల్లల కోసం బాటిల్‌ కొంటే, దాని శక్తినీ, దుష్ర్పభావాలనూ అంచనా వేయాలి. మెటీరియల్‌ ఎలా ఉందో తెలుసుకోవాలి. అందం మాత్రమే కాకుండా ఆరోగ్యం అనే కోణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక స్కూల్స్, కంపెనీలు కూడా ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వినియోగాన్ని తగ్గించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాల్సిన అవసరముందని నిపుణులు, సామాజికవేత్తలు నినదిస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిల్‌ ఇప్పుడు ఒక హస్తభూషణం అవుతున్నా, దీని వెనుక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును పణంగా పెట్టుకోవడం దురదృష్టకరం. మన చేతిలో ఉన్న బాటిల్‌ కాస్త బాధ్యతతో ఎంచుకుంటే, మన ఆరోగ్యాన్ని రక్షించడమే కాదు, భూమిని కూడా కాపాడిన వాళ్లమవుతామని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు.  

 స్టైలిష్‌ డిజైన్ల పేరిట ప్రమాదం..  
బిస్‌ ఫినాల్‌–ఏ (బీపీఏ), మైక్రోప్లాస్టిక్స్‌ వంటి రసాయనాలు కొన్ని తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో ఉండే అవకాశముంది. ఇవి నీటిలో కలిసిపోయి మానవ శరీరంలోకి చేరినప్పుడు, హార్మోనల్‌ డిసార్డర్స్, మానసిక అభివృద్ధి సమస్యలు, తక్కువ నిరోధక శక్తి వంటి అనారోగ్యాలను కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి ఇది ఓ మౌన సంకటమే. వాస్తవానికి తల్లిదండ్రులకు దీనిపై అవగాహన లేకపోవడంతో స్టైలిష్‌ డిజైన్ల పేరిట ప్రమాదాన్ని కొనుగోలు చేస్తున్నారు.

చదవండి: రూ. 20 వేలతో ష్యాషన్‌ బ్రాండ్‌..కోట్ల టర్నోవర్‌ : దోస్తుల సక్సెస్‌ స్టోరీ

ప్రత్యామ్నాయాల వైపు చూపు.. 
మెటల్‌ బాటిల్స్‌ (స్టీల్, కాపర్‌) మునుపటి కాలంలో ఎక్కువగా వాడేవారు. ఇవి ఆరోగ్యానికి మంచివి, మైక్రోప్లాస్టిక్స్‌ సమస్య ఉండదు. దీర్ఘకాలికంగా వాడవచ్చు. కానీ ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో ఉన్న డిజైన్‌ వైవిధ్యం, తక్కువ ధర, తక్కువ బరువు వల్ల ప్రజలు వాటిపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ స్థితిలో డిజైనర్లకు, తయారీదారులకు కూడా నూతన బాధ్యత ఉంది.. ఆరోగ్యానికి హానీ లేకుండా, ఆకర్షణీయమైన డిజైన్లతో మెటల్‌ బాటిల్స్‌ తయారుచేయడం మాత్రమే దీనికి ఏకైక పరిష్కారం. వీలుంటే గ్లాస్‌ బాటిల్లు వినియోగించడం మరింత ఉత్తమం.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)