Breaking News

ఏసీ లేకున్నా ఎంత హాయి!

Published on Thu, 04/10/2025 - 09:22

వేసవి వచ్చిందంటే చాలు... ఫ్యాన్‌ నాన్‌ స్టాప్‌గా తిరగాల్సిందే. ఏసీ ఎప్పుడూ పని చేయాల్సిందే. కరెంట్‌ బిల్లు భారం సంగతి ఎలా ఉన్నా... ఏసీల అధిక వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బెంగళూరుకు చెందిన వారణాసి సత్యప్రకాష్‌ ‘వారణాసి హౌజ్‌’ను సృష్టించాడు. ఏసీ అవసరం లేకుండానే ఈ ఇల్లు చల్లగా ఉంటుంది. 

ఇంటి నిర్మాణం విషయానికి వస్తే... హీట్‌ ట్రాపింగ్‌ సిమెంట్‌ గోడలకు బదులుగా బోలు మట్టి బ్లాకులను ఎంచుకున్నాడు. ఇవి ఉష్ణోగ్రతను సహజంగా నియంత్రిస్తాయి. వేసవిలో ఇంటిని చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. ఫ్రెంచ్‌ కిటికీల వల్ల తగినంత వెంటిలేషన్‌ ఉంటుంది.  ఇంటి రూపకల్పనలో ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, భూగర్భ జలాలను రీచార్జ్‌ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేపల కొలను, నీటి ప్రవాహాలు, బావి ఉన్నాయి. 

కారు షెడ్‌కు దగ్గరలో అందమైన పూలతోట... వర్షపు నీటిని భద్రపరిచే ఏర్పాటు కూడా కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్‌ కూలింగ్‌ అవసరం లేకుండా రెడ్‌ ఆక్సైడ్‌ ఫ్లోర్స్, పైన్‌ వుడ్‌ ఇంటీరియర్స్, నేచురల్‌ చిమ్నీ... మొదలైనవి కనిపిస్తాయి.‘క్రాస్‌ వెంటిలేషన్, డిస్‌ప్లేస్‌మెంట్‌ వెంటిలేషన్‌ సూత్రాలను మిళితం చేసి ఇంటికి రూపకల్పన చేశాం’ అంటున్నాడు సత్యప్రకాష్‌. 

(చదవండి: మామయ్య ప్రవర్తనతో నరకం కనిపిస్తోంది!)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)