Breaking News

పెద్దపండగకు భాగ్యవంతులొస్తున్నారు!!

Published on Tue, 01/13/2026 - 08:16

సాక్షి,ప్రతినిధి, విజయనగరం: ఆశలు మూటలు నెత్తిన మోస్తూ.. గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ.. పెద్దపండగకు ఒక్కొక్కరుగా భాగ్యవంతులు ఇంటిల్లిపాదీ చేరుకుంటున్నారు. వారిని వలసకూలీలని సామాజికవేత్తలు అంటున్నా.. నా లాంటి అల్ప సంతోషుల దృష్టిలో వారు నిజమైన భాగ్యవంతులు. వాళ్లంతా ఇక్కడ బతకలేని పేదల ని మేధావులు పేర్కొంటున్నా.. నా లాంటి సామా న్యులకు మాత్రం వాళ్లంతా తమ బతుకులు బాగుచేసుకునేందుకు జిల్లాల హద్దులు దాటిన శ్రమజీవులు. ఏ పల్లెలో చూసినా వారి ముచ్చటే ఎక్కువ. అక్కడ రాత్రీపగలూ శ్రమించి సంపాదించిన నాలుగు రూపాయలతో ఊరిలో ఆనందంగా గడుపుతా రు. సంక్రాంతి తమదే అన్న రీతిన ఊరంతా కలియతిరిగి తిరుగుప్రయాణమవుతారు. ఊళ్లలోకి వచ్చిన భాగ్యవంతుల ముచ్చటకు ‘సాక్షి’ అక్షర రూపం.   

హైదరాబాద్‌ నుంచి వచ్చిన అప్పలనాయుడు, లక్ష్మి, నాయుడి వీరకాడు నారాయణ.. వీధి మధ్యన దమట ముట్టించి చుట్టూ కూర్చుని కబుర్లు మొదలెట్టారు.. మరేటిబావా హైదరాబాద్‌లో అంతా బాగు న్నట్టేనా.. అన్న నారాయణ ప్రశ్న పూర్తి కాకుండానే లక్ష్మి అందుకుని.. పర్లేదన్నయ్యా.. ఇద్దరం డ్యూటీకి వెళ్తాం.. మాతోబాటే మా మహేష్‌ కూడా వస్తాడు. ముగ్గురికి బాగానే వస్తాది.. ఆదివారం సెలవు.. ఒకరి జీతం అద్దెకి.. ఖర్చులకు పోయినా.. రెండు జీతాలు మిగుల్తాయి. ఆ డబ్బులతోనే కదా ఈ ఇల్లు పునాదులు, రేకులు వేయడం, పెద్దదాని పెళ్లి అప్పు లక్షన్నర తీర్చడం.. చిన్నదాని నర్స్‌ ట్రైనింగ్‌.. అంతా దాన్లోంచే అంటున్నప్పుడు ఒకనాడు వంద నోటును అబ్బురంగా చూసిన పేదరికాన్ని కష్టంతో దాటుకొచ్చాము అంటున్న లక్ష్మి ఆత్మవిశ్వాసం కని పిస్తుంది. 

అంతలోనే లక్ష్మి మళ్లీ అందుకుని తిండికి.. గుడ్డకు లోటు లేదన్నయ్యా.. మీ బావకు మాత్రం వారానికి మూడ్రోజులు మాంసాహారం ఉండాలి అంటున్నప్పుడు.. ఆరేడేళ్లు కిందట ఇదే ఊరిలో అడ్డెడు బియ్యం.. తవ్వెడు నూకలికి ఇల్లిల్లూ తిరిగిన జ్ఞాపకాన్ని మర్చిపోలేదు అంటూనే ఇప్పుడు మేం అలా లేం.. మేం కష్టంతో స్థాయిని పెంచుకున్నాం అంటుంది.. పోనిలేరా  ఊరిలో అయినోళ్ల ముందు చెడి.. చెయ్యిచాచి బతకడం కన్నా ఊరుదాటి బాగుపడడం మేలని నారాయణ చెబుతుండగా పక్కింటి వదిన చేటలో చెత్త పెంట మీద పారేస్తూ దమటకాడికి వస్తూనే ఏటీ లచ్చిమొదినా.. చెవులోవి కొత్తవా ఏటి అంటూ పలకరించినప్పుడు.. 

లక్ష్మి మొహం సంతోషంతో వెలిగిపోయింది. అవును మంగొదినా.. ఇన్నాళ్లకు అరుతులం చెయిను అరుతులం జుంకాలు చేయించాడు మీ అన్న య్య అని చెబుతూ... భర్తను మురిపెంగా చూస్తుంటే దమట వెలుగులో జుంకాలు మరింత మెరుస్తూ కనిపించా యి. ఇదిగో ఈ చీర్లన్నీ పెద్దషాపు లో కొనేశాం ఒకేసారి అంటున్నప్పుడు.. అప్పట్లో పాత చీరలకోసం తెలిసినవాళ్లను అడిగిన లక్ష్మి గొంతు నుంచి.. మాకిప్పు డా అవసరం లేదన్న భరోసా వినిపించింది. మొన్నామధ్య యాదగిరి వెళ్లాం.. తిరుపతి కన్నా పెద్దది తెలుసా... అని చెబుతున్నప్పుడు.. మేం.. విహారయాత్రలకూ వెళ్తాం.. మేం అప్పట్లా లేం..అనే ధీమా ముప్పిరిగొంటుంది. 

   పాత్రల పేర్లు మారతాయేమో కానీ ఉమ్మడి విజయనగరంలోని పలు గ్రామాల్లో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి.. ఆరేడేళ్లు కిందట పూటపుటనూ లెక్కించుకుని జీవించే వందలాది కుటుంబాలు..  కాలాన్ని నిందించలేదు. ప్రభుత్వాలను తిట్టలేదు. కష్టాన్ని నమ్ముకుని ట్రైన్‌.. బస్సు ఎక్కి.. పని ఉన్న చోటకు వెళ్లాయి. రైస్‌ మిల్లులు.. నూలు మిల్లులు.. టాబ్లెట్స్‌.. ప్లాస్టిక్‌ కంపెనీలు.. చేపలు.. రొయ్యల చెరువులు.. ఫామ్‌ హౌస్‌లు, కోళ్లఫారాలు.. డైరీ ఫారాలు.. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేరిపోయాయి. పాపం అమాయకులు. నిజాయితీగా ఒళ్లొంచి పని చేస్తారు.. అందుకేనేమో కొద్దిరోజుల్లోనే యజమానులకు ఇషు్టలైపోయారు.. చాలామందికి.. చిన్నపాటి షెడ్‌.. ఇల్లు.. రేషన్‌ కూడా యజమానులే ఇస్తారు. 

ఇక ఖర్చేముంది.. మూణ్ణాలుగేళ్లు తిరిగేసరికి తమ జీవితం మారుతుందన్న.. మారిందన్న తేడా వాళ్లకే స్పష్టంగా కనిపిస్తోంది. రూ.కోట్లు లేకపోవచ్చు.. రూ.లక్షలూ అక్కర్లేదు.. శ్రమే పెట్టుబడి.. మూడేళ్లు తిరిగేసరికి మెల్లగా చేతిలో డబ్బు కనిపిస్తుంది.. తమ అభివృద్ధి తమకే తెలుస్తోంది.. ఓపికున్నన్నాళ్లు చేద్దాం.. ఊళ్లోకొచ్చిమాత్రం చేసేదేముందన్న ధీమా.. కష్టంలోనే ఆనందం.. వచ్చే జీతంలోనే సంతోషం.. ఆ పక్కనే సంబరం.. ఇంతకన్నా భాగ్యవంతులెవరు.. డబ్బుమాత్రమే ఉన్నోళ్లు ధనవంతులు అవుతారు. జీవితంలో అన్ని కోణాలూ.. అన్ని భావాలూ.. అన్ని ఎత్తుపల్లాలూ చూసి తమను తాము గెలిచిన వాళ్లు భాగ్యవంతులే... 

ఓ రాసీరాయని పెన్నుతో వీళ్ల జీవనరేఖలను బ్రహ్మ తన ఇష్టానుసారం రాసేస్తుంటే బ్రహ్మచేతిని ఒడిసి పట్టుకుని అలాక్కాదు... మా రాత మేం రాసుకుంటాం.. నువ్‌ పక్కకేళ్లు స్వామీ అని గదమాయించి తమ రేఖలను భాగ్యరేఖలుగా మార్చుకున్న కుటుంబాలు కోకొల్లలు... వీళ్లెవరూ పేదలు కారు... అవును పేదలు కారు... అక్షరాలా శ్రామికులు.. కార్మికులు... 

కృషి.. శ్రమ ఉన్న చోట పేదరికం ఉండదు. దానికి వీళ్లంటే భయమెక్కువ.. పారిపోతుంది.. ఎక్కడికి.. ఇంకెక్కడికి.. సోమరిపోతుల దగ్గరకు..!   
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)