Breaking News

చేతులతో ఎందుకు తినాలంటే..? ఆర్థికవేత్త అద్భుతమైన వివరణ ఇదే..

Published on Sun, 09/06/2026 - 14:54

భారతీయులు ఆహారాన్ని ఎందుకు చేతులతో తింటారంటూ చాలాసార్లు విదేశీయలు ప్రశ్నిస్తూ..మన సంస్కృతిని అవమానిస్తుంటారు. పైగా మన విధానాన్ని నాగరికత లేని వ్యక్తిగా అభివర్ణిస్తూ తిట్టిపోస్తుంటారు. ఇలాంటివి మనం చాలాసార్లు చూశాం కూడా. దీనికి ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్‌ సన్యాల్‌ చాలా అద్భుతమైన సమాధానమిచ్చారు. మరోసారి ఆ ప్రశ్న లేవనెత్తే ఛాన్సే లేకుండా గట్టి కౌంటరిచ్చారు. అందుకు సంబంధించిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఫ్లోరిడాకు చెందిన అకా అనే వ్యక్తి ఒక దక్షిణాది వివాహం లేదా సాంప్రదాయ పెళ్లి భోజనాలకు సంబంధించిన వీడియోని షేర్‌ చేశారు. అందులో ఒక జంట చేతులతో భోజనం చేయడం కనిపిస్తోంది. ఆ వీడియో చూపిస్తూ..నిజంగా అడుగుతున్నా..వారంతా ఎందుకు చేతులతో తింటున్నారు అని ప్రశ్నించాడు. ఇది నవంబర్‌ 2025లో వైరల్‌ అయిన పోస్ట్‌. ఇది మన భారత ప్రముఖ ఆర్థివేత్త సంజీవ్‌ సన్యాల్‌ దృష్టికి వచ్చింది. ఆయన ఈ వీడియోని రీట్వీట్‌ చేస్తూ..ఇలా సమాధానమిచ్చారు. 

ఇదొక సింపుల్‌ టెస్ట్‌ అని. మీరు తాకి పదార్థాన్ని తినే ధైర్యం లేకపోతే స్పూన్లు, కత్తులు వంటి ఇనుప ఆయుధాలను ఉపయోగించండి పర్లేదు. కానీ అలా తింటే గనుక ఆ ఆహారాన్ని తినొచ్చా లేదా అని మీ నోరు నిర్ణయించడం కష్టం అవుతుంది అని అద్భుతంగా రిప్లై ఇచ్చారు. ఆయన చేతి స్పర్శ తినే పదార్థం మధ్య ముడిపడి ఉన్న రుచిని, తినాలనే అనుభూతిని హైలెట్‌ చేస్తూ చెప్పారు. నిజంగానే మనం టచ్‌ చేయగానే బాగుంది తినొచ్చు అనిపించి..సులభంగా తినగలం. 

పైగా చేయి తాకడంతోనే రుచి కూడా అధికమవుతుది. అదే కత్తులు, స్పూన్లు వాడితే నోట్లో పెట్టుకునేంత వరకు రుచిని చెప్పలేరని స్పర్శతో ఆహారానికి ఉన్న సంబంధాన్ని హైలెట్‌ చేసింది. కాగా, నెటిజన్లు ఆర్థికవేత్త సన్యాత్‌ అద్భుతమైన రిప్లైకి ఫిదా అవుతూ ..చాలా చక్కటి పాయింట్‌ని చెప్పారు సార్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్‌లు పెట్టారు. 

 

(చదవండి: సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు!)
 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)