Breaking News

సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్‌

Published on Fri, 10/03/2025 - 18:21

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ (Shoaib Malik) వివాహం గురించి మరోసారి వార్తల్లో నిలిచాడు. ముచ్చటగా చేసుకున్న మూడో పెళ్లి కూడా ముక్కలు కానుందా? తాజా వార్తలు ఈ  ఊహాగానాలనే బలపరుస్తున్నాయి. భార్య, నటి సనా జావేద్‌ (Sana Javed)తో విభేదాల  కారణంగా  విడాకుల బాట పట్టినట్టు వార్తలొస్తున్నాయి.

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా (Sania Mirza)తో  14 ఏళ్ల వివాహ బంధానికి  స్వస్తి పలికి సనా జావేద్‌ను వివాహం చేసున్నాడు షోయబ్. అప్పటినుంచి చెట్టాపట్టా లేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇటీవలదూరంగా ఉంటున్నారట. తాజా మీడియా నివేదిక ప్రకారం, మనస్పర్థలతో షోయబ్-సనా జంట విడాకులకు సిద్దమవుతోంది.  

 ఇటవలి ఒక సందర్భంగా షోయబ్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా సనా  మొఖం తిప్పుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోకుండా సీరియస్‌గా ఉండటం ఒకే సోఫాలో కూర్చున్నప్పటికీ  దూరం దూరంగా  ఉన్న వీడియో వైరల్‌ అయింది.   దీంతో మూడో పెళ్లి ముచ్చట కూడా మూణ్నాళ్లే.. ఇద్దరి మధ్య మాటల్లేవా అంటూ కొందరు, భార్యభర్తల మధ్య ఇలాంటివి మామూలే అని కొందరు నెటిజన్లు కమెంట్స్‌ చేశారు. అయితే, అటు షోయబ్ గానీ, ఇటు  సనా గానీ ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు

 

కాగా  షోయబ్ మాలిక్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను 2010 ఏప్రిల్ 12న, హైదరాబాద్‌లో రెండో  పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి  కొడుకు (ఇజాన్‌) పుట్టాడు.   విభేదాల కారణంగా    2023లో విడిపోయిన సంగతి తెలిసిందే.

 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)