Breaking News

సమంత హైప్రోటీన్‌ డైట్‌..ఆ మూడింటితో ఫుల్‌ఫిల్‌..!

Published on Tue, 10/21/2025 - 17:41

టాలీవుడ్‌ నటి సమంత రూత్‌ ప్రభు తన డైట్‌ గురించి ఒక ఇంటర్వూలో వెల్లడించారు. ప్రతి మహిళకు అవసరమైన ప్రోటీన్‌ విషయంలో తాను అస్సలు నిర్లక్ష్యం చేయనని చెప్పారామె. అందుకోసమే తాను తప్పనిసరిగా వందగ్రాముల ప్రోటీన్‌ని వినియోగిస్తానని చెప్పారామె. దాదాపు 50 కిలోలు ఉండే ఆమె ఈ రేంజ్‌లో ప్రోటీన్‌ తీసుకోవడం సరైనదేనా అంటే..

భారతీయ మహిళలందరికీ సాధారణంగా 60 నుంచి 80 గ్రాముల ప్రోటీన్‌ తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ సమంత అంతకుమించి తీసుకోవడం అంటే..బహుశా కార్బోహైడ్రేట్‌కి బదులుగా లేదా వర్కౌట్ల రీత్యా అవసరం అయ్యి ఉండొచ్చని అన్నారు. అయితే ఇక్కడ అంత మోతాదులో ప్రోటీన్‌ ఎలా అని సందేహ పడాల్సిన పని కూడా లేదని అంటున్నారు నిపుణులు. 

అందుకోసం కేవలం ఈ మూడింటితో భర్తి చేస్తే చాలని చెబుతున్నారు. పెరుగు, పన్నీర్‌, పప్పు తీసుకుంటే చాలని చెబుతున్నారు. దీంతోపాటు పోషకాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 

ప్రదానంగా గుర్తించుకోవాల్సినవి..

వెజ్‌ ప్రోటీన్‌ ఒక్కోసారి కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో కలిసి వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరి హై ప్రోటీన్‌డైట్‌ సరిపడకపోవచ్చు. గట్‌ సమస్య ఉన్నవారికి అదనపు ప్రోటీన్‌ తీసుకోవడం ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు. 

అదీగాక అధిక ప్రోటీన్‌, తక్కువ ఫైబర్‌ ఉన్న ఆహారం మలబద్దకం, జీర్ణశయాంంతర సమస్యలకు దారితీస్తుందనేది గ్రహించాలని చెబుతున్నారు. 

ఇక్కడ గట్‌ఆరోగ్యంపై దృష్టిసారిస్తూ..క్రమంగా ప్రోటీన్‌ తీసుకోవడం పెంచడం మంచిదని చెబుతున్నారు. 

అదే సమయంలో ఇక్కడ సమంతా అంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది మొత్తం ఆరోగ్యం, ప్రోటీన్‌ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అయితే సగటు వ్యక్తికి "సెలబ్రిటీ నియమావళి" వర్తించిందని, అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. అందుకు బదులుగా స్మార్ట్‌గా ఎంపిక చేసుకుని తినడం మంచిదని సూచించారు నిపుణులు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: Hungover After Diwali: దీపావళి హ్యాంగోవర్‌ని తగ్గించే నేచురల్‌ డిటాక్స్‌..తక్షణ ఉపశమనం!)



 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)