Breaking News

ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..

Published on Sun, 06/09/2024 - 12:57

ప్రపంచంలో తేయాకు రకాలు ఎన్నో ఉన్నాయి. అరుదైన రకాల తేయాకుకు, అలాంటి రకాల తేయాకు తయారు చేసిన తేనీటికి ధర ఎక్కువగా ఉంటుంది. చైనాకు చెందిన ఊలాంగ్‌ టీ చూడటానికి బంగారు రంగులో ఉంటుంది. అంతమాత్రాన అది బంగారు తేనీరు కాదు. సింగపూర్‌లోని టీడబ్ల్యూజీ కంపెనీ మాత్రం అచ్చంగా బంగారు తేయాకు విక్రయిస్తోంది.

నాణ్యమైన తేయాకులను పొడవుగా కత్తిరించి, ఆరబెట్టిన తర్వాత ఆ తేయాకులకు 24 కేరట్ల బంగారు పూత పూసి కళ్లు చెదిరే ప్యాకింగ్‌తో అందిస్తోంది. బంగారు పూత పూసిన ఈ తేయాకును 50 గ్రాముల మొదలుకొని 1 కిలో వరకు ప్యాకెట్లలో అమ్ముతోంది. ఈ తేయాకు తయారు చేసిన తేనీరు బంగారు రంగులో ధగధగలాడుతూ కళ్లు చెదరగొడుతుంది.

ప్రస్తుతం దీని ధర కిలో 12,830 డాలర్లు (రూ.10.70 లక్షలు) మాత్రమే! టీడబ్ల్యూజీ కంపెనీ సింగపూర్‌లో రెస్టారంట్‌ను కూడా నిర్వహిస్తున్నా, అక్కడ ఈ బంగారు తేనీటిని అందించరు. కావలసిన వారు ఈ తేయాకు ప్యాకెట్లను కొని తీసుకువెళ్లాల్సిందే!

ఇవి చదవండి: ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా?

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)