Breaking News

పుస్తకాలు ప్రాణం పోసుకుంటున్నాయి

Published on Sat, 06/20/2026 - 06:28

గ్రంథాలయం సమాజానికి హృదయం వంటిది. ఆ గ్రంథాలయంలోని సాహితీ సంపద ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది. డిజిటల్‌ సముద్రంలో ఈదులాడుతున్న సమూహాలకు మంచినీటి ఊటలా ఇంకా పుస్తకం దాహం తీరుస్తూనే ఉంది. సాహితీ దాహార్తులకోసం మంచి పుస్తకాలను అందించాలనే తపనతో వైజాగ్‌ నగరంలో బుక్‌ మ్యాజిక్‌ రీడింగ్‌ క్లబ్‌ను నడుపుతున్నారు కొందరు ఔత్సాహికులు. అందరూ ఆధునికపు హంగుల వైపు అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో వయసు భేదం లేకుండా పుస్తకం వైపు నడిచేలా చేస్తున్నారు వీరు.  

‘ఒకప్పుడంటే గ్రంథాలయాల విలువ తెలిసినవారు ఉండేవారు. ఈ రోజుల్లో ఇది సాధ్యమా..’ అనే వారికి వైజాగ్‌ వాసులకు చేరువైన బిఎమ్‌ఆర్‌సి (బుక్‌ మ్యాజిక్‌ రీడింగ్‌ క్లబ్‌) సరైన సమాధానం అవుతుంది. వీరు పుస్తకాల ద్వారా ప్రజలకు ఏం చె΄్పాలనుకుంటున్నారు, ఎలా తమ ఆలోచనను ముందుకు తీసుకువెళుతున్నారు.. అనే విషయాలను అడిగితే ఎన్నో విషయాలను మన ముందుంచారు.

పిల్లలకు ఆకర్షణీయమైన కథలు
బుక్‌ మ్యాజిక్‌ రీడింగ్‌ క్లబ్‌ రూపకల్పన గురించి ఫౌండర్‌ హరి మాదాల మాట్లాడుతూ –‘‘మా కథల కార్యక్రమం ఎలా సాగుతుందంటే.. ‘ధైర్యవంతులైన వీరులు, మాట్లాడే జంతువులు, అంతులేని ఊహలతో మా పుస్తకాలయం నిండిపోతుంది’ అన్నారు. హరి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. నాలుగేళ్ల క్రితం సింగపూర్‌ నుంచి వైజాగ్‌ వచ్చేశాక కొన్ని రోజుల్లోనే అక్కడి పట్టణ వాతావర ణంలో ఎవరికి వారే అన్నట్టుగా ఉండటం గమనించారు. తమచుట్టూ ఓ మంచి కమ్యూనిటీని బిల్డ్‌ చేయాలనుకున్నారు. అందుకు తగినట్టుగా వైజాగ్‌ ఉక్కునగరంలో పిల్లల కోసం బుక్‌ లైబ్రరీని ఏర్పాటు చేశారు. తమ పిల్లలను తీసుకొని వచ్చే తల్లిదండ్రులతో పరిచయాలు ఏర్పడతాయని ఆలోచించారు. ఇంగ్లిష్, తెలుగు సాహిత్యంలో కామిక్స్, ఫిక్షన్‌ బుక్స్‌ని లైబ్రరీలో ఉంచారు. కేవలం బుక్‌ రీడింగ్‌ అంటే అందరికీ ఆసక్తి ఉంటుందో లేదో అని ఆలోచించి పిల్లలకు వారాంతాల్లో కథలు చెప్పడం, ఆర్ట్‌ వర్క్‌.. యాక్టివిటీస్‌ చేయించడం మొదలు పెట్టారు.  

పెద్దవాళ్లకు రివ్యూస్‌
ప్రైవేట్‌ కంపెనీలో మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కవిత మాట్లాడుతూ–‘‘టీవీ, మొబైల్స్‌తో టైమ్‌ పాస్‌ చేసే పెద్దవాళ్లు, గృహిణులు మన ఇళ్లలో ఉంటారు. వారిని రప్పించడానికి బుక్‌ రివ్యూ ΄్లానింగ్‌ సక్సెస్‌ అయ్యింది, వారాంతపు సాయంత్రాల్లో బుక్‌ రివ్యూ ఉంటుంది. కొంతమంది ఆ వారం తాము ఏ బుక్‌ గురించి, కథ గురించి చెబుతారో.. ఆ విషయాలు ముందుగానే చెప్పి, పాల్గొంటారు. కొందరు బుక్‌ రివ్యూస్‌ వినడానికే వస్తుంటారు’ అని వివరించారు. ‘ఈ బుక్‌ మ్యాజిక్‌ క్లబ్‌ యాక్టివిటీస్‌కి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, చూసి కొంతమంది తమ ప్రాంతంలో కూడా స్టార్ట్‌ చేస్తామంటూ ఆసక్తి చూపారు. అలా, గాజువాకలో, స్టీల్‌ ΄్లాంట్‌లో బుక్‌ మ్యాజిక్‌ క్లబ్‌ను స్టార్ట్‌ చేశారు కొందరు. చాలా మంది బుక్స్‌ చదవడం మొదలుపెట్టాక తమ లైఫ్‌లో మార్పులు వచ్చాయని, చాలా ఉపయోగకరంగా ఉంటోందనీ చెబుతున్నారు. అంటే, పుస్తకం విలువ ఎప్పుడూ పెరిగేదే తప్ప, తగ్గదు’ అని వివరించారు బుక్‌ మ్యాజిక్‌ రీడింగ్‌ క్లబ్‌ మెంబర్‌ ఉపాసన.

సరైన ఎంపిక పుస్తకమే..
5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు పుస్తకాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆ తర్వాత మళ్లీ 30 ఏళ్లు దాటినవారే బుక్‌ రీడింగ్‌లో కనిపిస్తున్నారు. 12 నుంచి 30 ఏళ్లలోపు వాళ్లు మాత్రం పుస్తకానికి దూరంగా ఉండటం గమనించాం. వారు కాలేజీ చదువులు, ఉద్యోగంలో నిలదొక్కుకోవడంలో బిజీగా ఉంటున్నారు. పిల్లలు ఫాంటసీ, కామిక్స్‌ అది కూడా బొమ్మల పేజీలలోని చిన్న చిన్న టెక్ట్స్‌ చదవడానికి ఇష్టపడుతున్నారు. మా చిన్నపాపకు రెండేళ్లు, 150 వర్డ్స్‌ వరకు చెబుతుంది. ఇమాజినేషన్‌కి, పబ్లిక్‌ స్పీకింగ్, వకాబులరీ..కి సరైన ఎంపిక పుస్తకమే. కార్పోరేట్‌రంగంలో టెక్నికల్‌ స్కిల్స్‌ కన్నా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ స్కిల్‌ను పుస్తకం నేర్పుతుంది. 

– హరి మాదాల, బిఎమ్‌ఆర్‌సి ఫౌండర్, వైజాగ్‌

రైటింగ్‌ వర్క్‌షాప్స్‌..
మా గ్రూప్‌లో 80 ఏళ్ల పెద్దావిడ కూడా మెంబర్‌గా ఉన్నారు. పాడ్‌ కాస్టింగ్‌ ద్వారా కథలు వింటున్నానని, అది తన ఆలోచనా ధోరణిని మార్చిందని చెబుతారావిడ. ఇప్పుడు మా క్లబ్‌ నుంచి 100 పుస్తకాలకు పైగా రివ్యూస్‌ జరిగాయి. గతంలో అనుకున్నది ఇప్పుడు నెరవేరింది. రైటర్స్‌ క్లబ్‌లో జరిగే రైటింగ్‌ వర్క్‌షాప్స్‌కూ వెళుతుంటాను. వాటిలో రాసిన కొంతమంది కథలను కలిపి, బుక్‌గానూ తీసుకువచ్చారు. మా బుక్‌ క్లబ్‌లో డాక్టర్లు, ఇంజనీర్లు, గృహిణులు, పిల్లలు, టీనేజర్లు, యువత, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడంతా డిజిటల్‌ యుగం కదా, పుస్తకాలు ఎవరు చదువుతారు అని చాలామంది అనుకుంటారు. మొదట్లో నెలకు ఒకసారి బుక్‌ రివ్యూస్‌ చేసేవాళ్లం. వచ్చేవారి ఆసక్తిని గమనించి రెండువారాలకోసారి ఏర్పాటు చేస్తున్నాం. కానీ, పిల్లల కోసం ప్రతి వారం రివ్యూ ్రపోగ్రాం పెట్టమని  అడిగేవారు పెరుగుతున్నారు. 

– డాక్టర్‌ ఆండాల్, బుక్‌ మ్యాజిక్‌ రీడింగ్‌ క్లబ్‌ మెంబర్, వైజాగ్‌ 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)