Breaking News

ఆరు గజాల అద్భుతం జిగ్‌ జిగ్‌ జమ్దాని

Published on Fri, 02/20/2026 - 05:50

దక్షిణ భారతదేశంలో కంచిపట్టు ఒక సాంస్కృతిక సంప్రదాయం. కంచిపట్టును ఇష్టపడే ప్రతివారూ జమ్దానీని ఇష్టపడతారు. జమ్దానీ అనేది అత్యంత క్లిష్టమైన ఒక ప్రాచీన నేత పద్ధతి. బంగ్లాదేశ్‌ భౌగోళిక గుర్తింపు ఉన్న జమ్దానీ చీర మన దేశంలోనే విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఈ డిజైన్ల ప్రత్యేకతతోనే శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది జమ్దానీ చీర. పదివేల రూపాయల నుంచి 4–5 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇంతటి ప్రాధాన్యత గల జమ్దానీ నేత చీర గురించి...

సన్నని దారాలను గట్టి దారానికి జోడించి క్లిష్టమైన జమ్దానీ డిజైన్స్‌ను సృష్టిస్తారు. వీటిని నేరుగా మగ్గంపై నేస్తారు. మొదట్లో మస్లిన్‌ క్లాత్‌ మీద నేసేవారు. ప్రతి చీరకు ఇద్దరు నేత కార్మికులు చేస్తారు. ప్రకృతి నుండి ప్రేరణ పొందిన డిజైన్లు, రేఖాగణిత ఆకారాలు వీటిలో ఉంటాయి. ఇటీవల ఢిల్లీలోని నేషనల్‌ క్రాఫ్ట్స్‌ మ్యూజియం అండ్‌ హస్తకళా అకాడమీలో జరిగిన ప్రదర్శనలో జమ్దానీ నేత చీర సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రదర్శన ప్రారంభోత్సవంలో దర్శకుడు ముజఫర్‌ అలా మాట్లాడుతూ ‘ఉమ్రావ్‌ జాన్‌’ సినిమాలో రేఖ కోసం జమ్దానీని ఎందుకు ఎంచుకున్నాడో తెలియజేశాడు. 60ల కాలంలో వచ్చిన సినిమాలలోనూ హీరోయిన్ల క్లాసిక్‌ లుక్‌ కోసం జమ్దానీ చీరలను ఎంచుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

జమ్దానీ అనేది రెండు పర్షియన్‌ పదాల కలయిక. ‘జామ్‌’ అంటే పువ్వు, ‘దాని’ అంటే వేజ్‌ అని అర్ధం. చీరపైన ఫ్లవర్‌వేజ్‌ డిజైన్లు ఉంటాయి. బంగ్లాదేశ్‌లోని నారాయణగంజ్‌ జిల్లాలో గల శీతలాక్షయ నది ఒడ్డున యునెస్కో గుర్తింపు పొందిన జమ్దానీ పరిశ్రమ ఉంది. దాదాపు 2,500 కుటుంబాలు జమ్దానీని సృష్టించడంలో నిమగ్నమై ఉన్నాయి. దీనిని బట్టి జమ్దానీది వేల ఏళ్ల క్రితం నాటిదిగా చెప్పవచ్చు. ఒకప్పుడు జమ్దానీలను హిందూ నేతకారులైన బసక్‌ అనే గ్రూప్‌వాళ్లు నేసేవారు. వారు బంగ్లాదేశ్‌ నుంచి వలస వెళ్లినప్పుడు స్థానిక మత్స్యకారులకు, ముస్లిమ్‌ నేత కార్మికులకు జమ్దానీ నేతలో శిక్షణ ఇచ్చినట్టుగా చెబుతారు. 

జమ్దానీ డిజైన్స్‌ కాటన్, హాఫ్‌ సిల్క్, మస్లిన్‌ క్లాత్‌పై వచ్చేలా నేస్తారు. నేత పనిలో ఉపయోగించే దారాల సంఖ్యను బట్టి ఆ చీర మృదువుగా ఉంటుందని చెబుతారు. పవర్‌లూమ్‌లోనూ ఈ తరహా చీరల తయారీ రావడంతో అన్ని వర్గాల వారికీ జమ్దానీ అందుబాటులోకి వచ్చింది. అయితే, నాణ్యత నేత చీర ద్వారానే తెలుస్తుంది.


నటి, రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్‌ బంగ్లాదేశ్‌ సందర్శించినప్పుడు ఆమె దేశంలోని ప్రముఖ జమ్దానీ చీర నేతకారులైన సోదరులు సాజిబ్, నషిదుల్‌ రసల్‌ లను కలిసింది. వారి దగ్గర నాలుగు అందమైన జమ్దానీ నేత చీరలను ఎంచుకుందని వారు చెబుతుంటారు.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)