Breaking News

మన సంస్కృతే సంస్కృతం

Published on Sun, 10/11/2026 - 04:17

పన్నెండేళ్లకే 1200 శ్లోకాల రచన
8వ తరగతిలోనే సంస్కృత అష్టావధానాలు
అవధాన బాల సరస్వతిగా బిరుదులు
ఇదంతా నరసింహ దేవర జయలక్ష్మి
సాధన చేస్తూ సాధిస్తున్న ప్రగతి.

హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ఈ బాల అవధాని ‘మన మూలాలను తెలుసుకోవాలంటే సంస్కృతం వచ్చి ఉండాలి, సంస్కృత సేవ చేయాలన్నదే  నా లక్ష్యం’ అంటూ వివరించింది.. 

‘‘సంస్కృతం పట్ల ఉన్న ఇష్టంతో సాధన చేస్తూనే, మిగతా అకడమిక్‌ విద్యనూ నేర్చుకుంటున్నాను. ఒకప్పుడు భారతదేశం సంస్కృతంలో విశ్వగురువుగా విరాజిల్లింది. మళ్లీ అలాంటి పూర్వ వైభవం రావాలి. ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో సంస్కృతం మార్మోగాలి. వృత్తి, ఉద్యోగాలు చేస్తూ రిటైర్‌ అయ్యాక సంస్కృతం నేర్చుకోవాలి అనుకోకూడదు. మా వయసు పిల్లలు సంస్కృతం నేర్చుకోవాలి. వారి పెద్దలూ ఆ దిశగా పిల్లలను గైడ్‌ చేయాలన్నది నా ఆకాంక్ష... ఇక నా విషయానికొస్తే... బెంగళూరులో ఆధునిక అకడమిక్‌ విద్యతోపాటు సంస్కృతం కూడా నేర్పే స్కూల్లో చదువుకుంటున్నాను. 

శ్లోక రచన: మా నాన్న మైథిలీనాథ్‌కు సంస్కృతం అంటే చాలా ఇష్టం. ‘మన మూలాలు సంస్కృతంలో ఉన్నాయి. కానీ, అన్నీ అనువాదాలు చదువుకుంటున్నాం. నేరుగా సంస్కృతంలోనే చదువుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి’ అంటారు. నాలుగున్నరేళ్ల వయసులో సంస్కృత శ్లోకం రాయడం చూసి అమ్మ కిరణ్మయి, తాతగారు ఉమామహేశ్వరరావు ప్రోత్సహించడంతో నా అడుగులు సంస్కృతం నేర్చుకునే దిశగా పడ్డాయి. ఆరేళ్లుగా శ్లోక రచనలో ఉన్నాను. గురువు ధూళిపాళ మహదేవమణిగారి ఆశీస్సులతో ‘పిబరే రామరసం’ శీర్షికతో వందశ్లోకాలు, వ్యాసావతరణం, గంగావతరణం, శమంతకోపాఖ్యానం.. ఇలా 1200 శ్లోకాలు రాశాను. శతావధానం, సహస్రావధానం దిశగా సాధన కొనసాగిస్తాను. ఆధునిక విద్యలో రాణిస్తూనే సంస్కృత సేవ చేయడమే నా  లక్ష్యం’’ అని వివరించారు ఈ బాల అవధాని. 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)