Breaking News

పట్నం కోతి సలహాలు

Published on Sun, 02/15/2026 - 03:58

ఒక పట్నం కోతి కొత్తగా అడవిలోకి వచ్చింది. వస్తూ వస్తూ అది ఒక ఇంట్లో నుంచి చిన్న అద్దం, పౌడర్‌ డబ్బా, పెదాలకు వేసుకునే ఎర్రరంగు దొంగిలించి తన వెంట తెచ్చుకుంది. అది ఒక చింత చెట్టు మీద తన నివాసం ఏర్పరచుకుంది. ఆ చెట్టు మీదనే తిమ్మమ్మ అనే కోతి తన కవల పిల్లలు చిట్టి, చిన్నిలతో కాపురం వుంది.

పట్నం కోతి అద్దంలో మొహం చూసుకుంటూ పౌడర్‌ రాసుకోవడం, పెదాలకు ఎర్రరంగు వేసుకోవడం ఆసక్తిగా చూసేవి చిట్టి, చిన్ని.
వాటిని చూసి పట్నం కోతి, ‘‘ఇలా రండి, మీకు కూడా పౌడర్‌ రాస్తాను’’ అంటూ పిలిచింది.
చిట్టి, చిన్ని పనస తొనలు తింటూ మొహాలకు పౌడర్‌ రాయించుకున్నాయి.

‘‘పనస తొనలను గింజలు తీసి తినాలి. అలా తినకూడదు. పట్నంలో గింజలు తినరు. పారేస్తారు’’ అంది పట్నం కోతి.
చిట్టి, చిన్ని పనస గింజలన్నీ తీసి పారేసి, గుజ్జు మాత్రమే తిన్నాయి.

అది మొదలు పట్నం కోతి వాటికి ఎలా నాజూకుగా నడవాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అంటూ కొత్త విషయాలు చెప్పడం మొదలు పెట్టింది.
చిట్టి, చిన్ని రోజంతా ఆ పట్నం కోతి మాటలు ఆసక్తిగా వింటూ, అది చెప్పినట్లుగా నడుచుకునేవి.

‘‘అలా రోజంతా కూర్చుని కబుర్లు వింటూ ఉంటే సోమరిపోతుల్లా తయారవుతారు. మిగతా పిల్లలను చూడండి, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో! మీరు కూడా చక్కగా వెళ్ళి వాటితో ఆడుకోండి.’’ అంటూ మొత్తుకునేది తిమ్మమ్మ. అయితే చిట్టి, చిన్ని తల్లి మాటలు లెక్క చేసేవి కావు. పట్నం కోతి దగ్గరకే పోయి కూర్చునేవి!

పట్నం కోతి దాని మాటలతో చిట్టి, చిన్నీల ఆహారపు అలవాట్లు మార్చేసింది!
‘‘దానిమ్మ తొక్కతో తినకూడదు, గింజలు వొలుచుకుని తినాలి. మొక్కజొన్న పొత్తి గింజలు తిని, కంకి పారేయాలి. మామిడి పండు రసం పీల్చుకుని తొక్క పారేయాలి. అరటి పండు తొక్క కూడా తినకూడదు. వీటితో పాటు ఆకుపచ్చని ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది!’’ అంటూ వాటికి నూరిపోస్తూ ఉండేది. అయితే నెల తిరిగేసరికి చిట్టి, చిన్ని నీరసపడ్డాయి. కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలు పెట్టాయి .

హడలిపోయిన తిమ్మమ్మ పిల్లలనిద్దరినీ తీసుకుని వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళింది. సంగతి తెలుసుకున్న ఎలుగు చిట్టి, చిన్ని నోట్లో పసరు మందు పోసి, ‘‘చూడండి పిల్లలూ! మనం పుట్టినప్పటి నుంచి ఏం తిని పెరుగుతున్నామో అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. వాళ్లూ వీళ్ళూ చెప్పారని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఇలాగే అనారోగ్యం పాలవుతారు. పళ్ళ మీద తొక్క, గింజలు ఇవే మనకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అవి తినకే మీరు నీరసపడ్డారు. ఆకులు, గడ్డి తింటే జీర్ణం కాదు. అది మీ ఆహారం కాదు. అందుకే ఈ కడుపు నొప్పి. ఈ వయసులో తిన్నది అరిగేదాకా ఆడుతూ ఉంటేనే, తిన్నది వంట పడుతుంది. ఇక ఆ పట్నం కోతి సలహాలు వినడం మానేసి, ఇన్నాళ్ళూ మీరు ఎలా ఉన్నారో, ఎలా తిన్నారో అలాగే ఉండండి. ఎటువంటి జబ్బు చేయదు!’’ అని చెప్పింది.
ఆ తరువాత చిట్టి, చిన్ని పట్నం కోతి సలహాలు పాటించక పోగా, క్రమంగా దానిని కూడా తమ దారిలోకి తెచ్చుకున్నాయి.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)