Breaking News

ఐరన్‌ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..

Published on Wed, 07/09/2025 - 10:31

ఇటీవల కాలంలో తారలు తమ అభిరుచులను ఇతర రంగాలకూ విస్తరిస్తున్నారు. వారిలో మరింత విభిన్నంగా తనని తాను నిరూపించుకుంటోంది 33 ఏళ్ల సయామీ ఖేర్‌. ఒకే సంవత్సరంలో రెండుసార్లు ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా వార్తల్లో నిలిచింది.

ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే సయామీ ఖేర్‌ జూలై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో జరిగిన ఐరన్‌మ్యాన్‌ 70.3 యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని, పతకాన్ని సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన ట్రయాథ్లాన్‌ సర్క్యూట్‌లలో ఒకటి. కిందటేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా మెడల్‌ అందుకున్న ఆమె ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది. 

తన విజయంపై సయామీ ఖేర్‌ స్పందిస్తూ  ‘ఎంతో ఆనందంగా ఉంది. క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమే. అలాగని ప్రపంచానికి నేనేంటో నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో ఇదంతా చేయలేదు. నా మనసుకు నచ్చింది చేస్తున్నాను. ఒక మహిళగా ఇది శారీరకంగా సవాల్‌తో కూడిన పనే. అసాధ్యం అనిపించిన దానిని పూర్తి చేయడంలో ఒక గర్వం, అపరిమితమైన ఆనందం’’ ఉంటాయి అంటోంది. 

నాసిక్‌కు చెందిన సయామీ ఖేర్‌ తెలుగు సినిమా ‘రేయ్‌’తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు అందుకున్న ఆమె... కొన్నాళ్ల గ్యాప్‌ అనంతరం ‘వైల్డ్‌ డాగ్‌’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. మళ్లీ తెలుగులో నటించలేదు. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్‌’లో కీలక పాత్ర  పోషించింది. 

(చదవండి: చేనేతలకు జాతీయ గౌరవం..! ఒకరు సరికొత్త పంథాతో, మరొకరు మార్కెటింగ్‌తో..)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)