Breaking News

సహదేవుడు.. ఖడ్గ యుద్ధ ప్రవీణుడు

Published on Mon, 08/17/2026 - 00:23

పాండవులలో కనిష్టుడు సహదేవుడు... పాండురాజు రెండో భార్య మాద్రికి అశ్వినీ దేవతల అనుగ్రహంతో జన్మించినవాడు. ద్రోణాచార్యుని శిక్షణ లో ఖడ్గయుద్ధంలో ఎంతో ప్రవీణుడిగా ఆరితేరాడు. అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో ‘తంత్రీపాలుడు’ అనే పేరుతో గోపాలకుడిగా పశు సంరక్షణ చేపట్టాడు.

సహదేవునికి భవిష్యత్తులో జరిగే విషయాలు ముందే తెలిసినప్పటికీ, జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ సూచనలతోపాటు చెబితే ఏం జరుగుతుందో అన్న భయం, వ్యక్తిగత భద్రత పట్ల సందేహాలు ఉండడంతో ఏ విషయం చెప్పేవాడు కాదు. బృహస్పతిలా గొప్ప వివేకం కలవాడైనా తనకు తానుగా ఎవరి భవిష్యత్తు చెప్పలేదు. గొప్ప  భవిష్యద్దార్శనికుడు అయినా ఇతరులతో పంచుకోలేడు. దీనినే ‘సహదేవ నీతి’ అంటారు.

సహదేవుడు అత్యంత తెలివైనవాడు. ధర్మరాజుకు సలహాదారు, ఖడ్గయుద్ధంతోపాటు ఆయుర్వేదం, పశు సంరక్షణలో ప్రవీణుడు. మంచి జ్యోతిష్యవేత్త. అతిముఖ్యంగా కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముహూర్తం పెట్టినవాడు సహదేవుడేనంటారు. అత్యంత సాధుశీలుడు, ధర్మవర్తనుడు, ఓర్పు, సహన స్వభావం కలిగిన వ్యక్తి.

కౌరవుల నాశనానికి కారకుడైన శకునిని తాను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన సహదేవుడు మహాభారత యుద్ధంలో 17వ రోజున శకునిని హతమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు.

– సి ఎన్‌. మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)