Breaking News

కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..!

Published on Tue, 05/21/2024 - 08:32

కలబందలో మొక్కలకు కావలసిన పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. అమైనా ఆమ్లాలు, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటివి 75 రకాలపోషకాలుంటాయి.. ఇది మొక్కలను క్రిములు, వైరస్‌లు, శిలీంధ్రాల నుంచి కాపాడుతుంది. కలబంద ఆకు ముక్కలను మిక్సీలో వేస్తే రసం వస్తుంది. స్పూనుతో ఈ కింద చెప్పిన కొలతలో ఇంటిపంటలు / మిద్దెతోటల సాగులో వాడుకోవచ్చు..

1. ఒక టీస్పూను కలబంద రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొలక దశలో లేదా చిన్న మొక్కలు స్ప్రే చేయవచ్చు. వారానికి ఒక సారి చేస్తే సరి΄ోతుంది.
2. ఒక టేబుల్‌ స్పూన్‌ రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొక్క ఉన్న కుండీలోపోయాలి. ఇలా నెలకు ఒకసారి చేయాలి. దీనివలన మొక్కకు ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది.
3. మొక్కను ఒక కుండీ నుంచి వేరే కుండీలోకి మార్చినప్పుడు లీటరు నీటికి ఒక టేబుల్‌ స్పూన్‌ రసాన్ని కలిపి కుండీలోపోయాలి. ఇలా చేస్తే మొక్క మార్పిడి వత్తిడికి గురికాదు.
4. ఎరువుగా వాడాలి అన్నప్పుడు 2 టేబుల్‌ స్పూన్ల కలబంద రసాన్ని లీటరు నీటితో కలిపి మొక్క కుండీలోపోయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి వాడాలి.
5. స్ప్రే చేయాలంటే ఒక టేబుల్‌ స్పూన్‌ వాడాలి లీటరు నీటికి. ఆకుల అడుగు భాగంలో మాత్రమే స్ప్రే చేయాలి. దీనివలన మొక్క తొందరగాపోషకాలను గ్రహిస్తుంది.
6. రూటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఏదైనా మొక్క కొమ్మను విరిచి నాటుకోవాలంటే, నేరుగా కలబంద రసంలో అరగంట కొమ్మ చివరను నానబెట్టి, ఆ తరువాత నాటవచ్చు.
7. ఇది బూడిద తెగులును అరికడుతుంది. 
గమనిక: కలబంద రసం తయారు చేసిన అర గంట లోపే వాడాలి. పులిస్తే అందులో ఉన్నపోషకాలు కొన్నిపోతాయి.
– విజయలక్ష్మి, బెంగళూరు మిద్దెతోట బృందం

ఇవి చదవండి: ఫోన్‌ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)