Breaking News

క్రికెట్‌ దేవుడే దిగి వస్తే...

Published on Sun, 02/25/2024 - 06:11

కశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్‌ అమిర్‌ హుసేన్‌ జీవితం వెలిగింది. రెండు చేతులూ లేకపోయినా మెడతో బ్యాట్‌ పట్టి ఆడే అమిర్‌ తనను ఇన్‌స్పయిర్‌ చేసిన క్రికెట్‌ దేవుడు సచిన్‌ని జీవితంలో కలుస్తాననుకోలేదు. కలిశాడు. అంతేనా? సచిన్‌ నుంచి ఊహించని బహుమతి అందుకున్నాడు. ఈ వివరం ఏమిటంటే...

సచిన్‌ టెండూల్కర్‌ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కశ్మీర్‌ పర్యటనలో ఉన్నాడు. ఇది అతని తొలి కశ్మీర్‌ పర్యటన అని భోగట్టా.  అక్కడి ‘చార్సో’ అనే ఊళ్లో ఉండే బ్యాట్ల తయారీ కేంద్రాన్ని సచిన్‌ సందర్శించాడు. అంతే కాదు... అక్కడి ‘బిజ్‌బెహరా’ ్రపాంతానికి చెందిన పారా క్రికెటర్‌ అమిర్‌ హుసేన్‌ను తన హోటల్‌కు పిలిపించుకుని ప్రత్యేకంగా కలిశాడు. అమిర్‌ హుసేన్‌ ప్రస్తుతం కశ్మీర్‌ పారా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

పుట్టుకతో చేతులు లేని అమిర్‌ తన జీవితంలో పేర్కొన్న నిరాశను సచిన్‌ను చూసి ఇన్‌స్పయిర్‌ అయి క్రికెటర్‌ కావడంతో పోగొట్టుకున్నాడు. బ్యాట్‌ను మెడ, భుజాల మధ్య పట్టి అతను క్రికెట్‌ ఆడతాడు. ఈ స్ఫూర్తిమంతమైన గాధను విన్న సచిన్‌ తన పర్యటన సందర్భంగా అమిర్‌ హుసేన్‌ను కలిశాడు. ‘నిన్ను కలవడం సంతోషం’ అని ‘ఎక్స్‌’లో తానే పోస్ట్‌ పెట్టాడు. సచిన్‌ని చూడగానే ఇలాంటిది తన జీవితంలో జరిగిందా అన్నట్టుగా భావోద్వేగంతో కదిలిపోయాడు అమిర్‌. ‘ఇలాగే నువ్వు మమ్మల్ని ఇన్‌స్పయిర్‌ చేయి’ అని అమిర్‌తో  సచిన్‌ చె΄్పాడు. అంతేనా? తను సంతకం చేసిన బ్యాట్‌ ఇచ్చి అమిర్‌ని తబ్బిబ్బు చేశాడు.
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య