సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్‌ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు

Published on Sun, 09/03/2023 - 11:52

ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రత్యేకంగా ఉపయోగించే నౌక. దీని పేరు ‘కొసాత్కా’– అంటే ‘కిల్లర్‌ వేల్‌’ జాతి తిమింగలం అని అర్థం. పుతిన్‌ దాదాపుగా మూడేళ్ల కిందటే ఈ భారీ నౌకను సొంతం చేసుకున్నా, ఇటీవలే దీనికి కళ్లుచెదిరే ఖర్చుతో అదనపు హంగులు సమకూర్చడంతో తాజాగా వార్తల్లోకెక్కింది. ఈ నౌకలోని అదనపు హంగుల కోసం 100 మిలియన్‌ పౌండ్లు (రూ.1.05 లక్షల కోట్లు) ఖర్చు చేయడం విశేషం. ఒకవైపు యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో దాదాపు మూడు లక్షల మందికి పైగా రష్యన్‌ సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఏమీ పట్టకుండా పుతిన్‌ తన నౌకను రాజసంగా తీర్చిదిద్దుకోవడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.

ఈ నౌక అసలు పేరు ‘ది గ్రేస్‌ఫుల్‌’. జర్మనీ రేవు నుంచి పుతిన్‌ దీనిని 750 మిలియన్‌ పౌండ్లకు (రూ.7.92 లక్షల కోట్లు) సొంతం చేసుకున్నాక, దీని పేరును ‘కొసాత్కా’గా మార్చుకున్నాడు. యుక్రెయిన్‌పై సైనిక దాడిని ప్రకటించడానికి కొద్దిరోజుల ముందే ఈ నౌకను రష్యాకు పంపాల్సిందిగా, నౌకా సంస్థను ఆదేశించాడు. ఈ నౌక రష్యా తీరానికి చేరుకున్న 23 రోజుల్లోనే యుద్ధం మొదలైంది. ఒకవైపు యుద్ధం కొనసాగుతుంటే, పుతిన్‌ మాత్రం ఈ నౌకను తాను కోరుకున్న రీతిలో తీర్చిదిద్దుకునే పనిలోనే నిమగ్నమయ్యాడు. ఇందులో ఖరీదైన క్రిస్టల్‌ షాండ్లియర్లు, కార్పెట్లు, సోఫాలు, కాఫీ టేబుళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా డ్రాయింగ్‌ రూమ్‌లలో బంగారు తాపడం చేయించాడు.

ఖరీదైన కళాఖండాలను ఏర్పాటు చేయించుకున్నాడు. ఇన్ని హంగులు చేయించుకున్న ఈ నౌక పొడవు దాదాపు అరకిలోమీటరు ఉంటుంది. ఇందులో స్విమింగ్‌ పూల్స్, పైకప్పు మీద హెలిపాడ్, బంగారు ఫ్రేముల అద్దాలు, బంగారు తాపడం చేయించిన సింక్‌ పైపులు వంటి ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. రష్యన్‌ అధికార వ్యతిరేక సంస్థ అయిన ‘అలెక్సీ నవాల్నీ’ ఈ నౌక లోపలి హంగుల ఫొటోలను, వాటి ఏర్పాట్లకు అయిన ఖర్చుల వివరాలను ఇటీవల వెలుగులోకి తెచ్చింది. 

(చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు! పొద్దుగూకినా ప్రాబ్లం లేదు!)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)