Breaking News

స్టన్నింగ్‌ లుక్‌తో అదిరిపోతున్న రుహానీ శర్మ ధరించిన చీర ఎంతంటే..?

Published on Sun, 12/24/2023 - 13:55

బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్‌ ఇచ్చి ఓ టూర్‌కి వెళ్లొస్తే కావల్సినంత ఉత్సాహం, ఎనర్జీ వస్తాయి. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం వల్ల మన ఆలోచన తీరే మారిపోతుంది. ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే ఫ్యాషన్‌ విషయంలోనూ ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తుంటా!  అంటోంది రుహానీ శర్మ. ఇక ఆమె నటించిన సినిమాలు విజయం సాధించకపోయినా, సోషల్‌ మీడియాలో  ఆమెకున్న ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. కారణం.. అప్‌ టు డేట్‌గా ఉండే ఆమె ఫ్యాషన్‌ స్టయిలే! ఆ యూనిక్‌నెస్‌ కోసం రుహానీ ఫాలో అవుతున్న ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. 

రియా జ్యూయెల్స్‌..
ట్రెండీ డిజైన్స్‌కు పెట్టింది పేరు రియా జ్యూయెల్స్‌. ఇదొక ఆన్‌లైన్‌ జ్యూలరీ స్టోర్‌. ఆకట్టుకునే.. వైవిధ్యమైన డిజైన్స్‌ను రూపొందిస్తూ యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. అన్ని రకాల బంగారు, వెండి, బంగారు పూత నగలతోపాటు ఫ్యూజన్, నక్షీ, నవరతన్‌ వంటి ఇతర డిజైనర్‌ నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే వీలుంది. 

నీరూస్‌..
నాలుగు దశాబ్దాలుగా ఫ్యాషన్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దేశీ బ్రాండ్‌ నీరూస్‌! దీనిని 1971లో హరీష్‌ కుమార్‌ ప్రారంభించారు. చక్కటి ఎంబ్రాయిడరీ, అందమైన డిజైన్స్‌లో లభించే వీరి దుస్తులకు మంచి ఆదరణ దొరకడంతో 1983లో ‘నీరూస్‌ టెక్స్‌టైల్స్‌’ పేరుతో ఫ్యాబ్రిక్‌ తయారీ సంస్థనూ ప్రారంభించారు. ఈ బ్రాండ్‌ డిజైన్స్‌కు విదేశాల్లోనూ డిమాండ్‌ ఎక్కువే. అయినా ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి. పలు ప్రముఖ ఆన్‌లైన్‌  స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. రుహానీ శర్మ ధరించిన నీరూస్‌ డిజైన్‌ చీర రూ. 24, 190/-

--దీపిక కొండి



 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)