Breaking News

అంబానీ డీప్‌ ఫేక్‌ వీడియో : లక్షల స్కాం వెలుగులోకి

Published on Sat, 06/22/2024 - 11:44

‘కూటికోసం కోటి విద్యలు’ అనేదాన్ని ‘కోటి మోసాలు’గా మార్చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.  ఏదో ఒక రకంగా ప్రజలను మభ్య పెట్టి, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కోవలోకి డీప్ ఫేక్ వీడియోలు వచ్చి చేరుతున్నాయి. సామాన్యుల నుంచి,  ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఆఫీసర్లు. హై ఫ్రొఫైల్‌ వ్యక్తుల దాకా నమ్మించి బోల్తా కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా బిలియనీర్‌, ప్రముఖ  వ్యాపారవేత్త పేరుతో డీప్ ఫేక్ వీడియో ద్వారా రూ.7లక్షలు మోసానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

ఏం జరిగిందంటే..
రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ పేరుతో తయారు చేసిన డీప్ ఫేక్‌ వీడియో ద్వారా ముంబైలోని అంధేరికి చెందిన మహిళా ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కె హెచ్ పాటిల్ నుంచి రూ.7 లక్షలు కొల్లగొట్టారు నేరగాళ్లు. అధిక రాబడి కోసం ‘రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్’ కంపెనీకి చెందిన బీసీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అకాడమీలో చేరాలని  అంబానీ  రికమెండ్‌ చేస్తున్నట్టు ఈ వీడియోను సృష్టించారు.  తద్వారా  తక్కువ పెట్టుబడికే, అధిక రాబడులు వస్తాయని నమ్మ బలికారు. 

ఏప్రిల్ 15న తన ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను చూసిన పాటిల్‌ ఆన్‌లైన్‌లో వెరిఫై చేయడానికి ప్రయత్నించినా కూడా అసలు విషయాన్ని పసిగట్టలేకపోయింది. లండన్‌, ముంబైలో కార్యాలయాలు ఉన్నాయని నమ్మి, పలుమార్లు నగదును డిపాజిట్ చేసింది. మే-జూన్ నెలల మధ్య  16 వేర్వేరు ఖాతాల్లో మొత్తంగా  రూ. 7.1 లక్షలు జమ చేయగా, దీనికి రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించినట్టు  ట్రేడింగ్ వెబ్ సైట్‌లో కనిపిస్తోంది. కానీ దానిని విత్‌డ్రా చేసుకొనే అవకాశంలేకపోవడంతో అనుమానం వచ్చింది. చివరికి  మోస పోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ పాటిల్ డబ్బు బదిలీ చేసిన 16 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. ఈ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)