ఎయిరిండియా విషాదం : రూ. 500కోట్లతో టాటా సన్స్‌ కీలక నిర్ణయం!

Published on Fri, 06/27/2025 - 11:21

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో మరో  కీలక పరిణామం చోటు చేసుకుంది.  జూన్ 12న  లండన్‌కు బయలుదేరిన  విమానం (AI-171) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన  విషాద సంఘటన 270 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాద బాధితుల  కుటుంబీకుల కోసం టాటా సన్స్‌  కీలక నిర్ణయం తీసుకుంది.

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల బంధువుల కోసం రూ. 500 కోట్ల ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అటా సన్స్ యోచిస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  విమాన ప్రమాద బాధితుల బంధువులకు ఆర్థిక సహాయం అందించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటుకు టాటా సన్స్ బోర్డు అనుమతులు కోరుతోంది. ఈ ఘోరవిషాదం తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దీని గురించి చర్చించారు.

ప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాల కోసం టాటా గ్రూప్ తీసుకున్న చర్యల గురించి డైరెక్టర్ల బోర్డుకు వివరిస్తూ, సహాయక చర్యలు త్వరగా అమలు అయ్యేలా చూసుకోవడానికి తాను ఎయిర్ ఇండియాతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నానని చంద్రశేఖరన్  వివరించారు. అలాగే వీరి సహాయార్థం  ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడానికి టాటా సన్స్ రూ. 500 కోట్ల అంచనా కేటాయింపుతో ఆమోదం కోరుతున్నట్లు  ది ఎకనామిక్ టైమ్స్   తెలిపింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ గతంలో రెండు ప్రత్యేక ట్రస్టులను ఏర్పాటు చేయాలని భావించింది. ఒకటి భారతీయ పౌరుల కుటుంబాలకు, మరొకటి విదేశీ పౌరులకు. ఈ మొత్తాన్ని 271 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు, వైద్య సంరక్షణ అలాగే ప్రభావితమైన బీజే మెడికల్ కాలేజ్ , సివిల్ హాస్పిటల్ పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తారు.

"టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజులలో ఒకటి" గా పేర్కొన్న  చంద్రశేఖరన్‌, కంపెనీ తన బాధ్యతల నుండి వెనక్కి తగ్గదని  గాయపడిన వారి వైద్య ఖర్చులు, బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణంలో సహాకారం తోపాటు సంబంధిత అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే   ఈప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ప్రయాణీకుడి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

Photos

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)