Breaking News

ఇదేం విడ్డూరం..సింగిల్‌ అరటిపండు అంత ఖరీదా..?

Published on Sun, 01/19/2025 - 13:12

మన దేశంలో వీధి విక్రేతల్లో కొందరూ చేసే పనులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అత్యాశతో చేస్తారో లేక విదేశీయలును చూడగానే అమాంతం ధర పెంచి చెబుతారో తెలియదు. ఒక్కసారిగా నిశితంగా ఆలోచిస్తే వారి ఉద్దేశ్యం సబబే అనిపిస్తంది. మరోకోణంలో చూస్తే భారతీయలంటే చులకన భావం కలుగుతుందేమో అనే సందేహం కలుగుతుంది. ఎందుకిదంతా అంటే..ఇక్కడొక వీధి వ్యాపారి ఓ విదేశీయుడికి అమ్మకం ధర చెప్పిన విధానం చూస్తే..షాకవ్వుతాం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో హ్యూ అనే విదేశీయుడు అటుగా వెళ్తున్న తోపుడు బండిపై అరటిపండ్లను అమ్ముకుంటున్న విక్రేతని పలకరిస్తాడు. అతని నుంచి అరటిపండ్లను కొనుగోలు చేద్దామనే ఉద్దేశ్యంతో ధర అడుగుతాడు. అయితే ఆ వ్యాపారి కళ్లు చెదిరే రేంజ్‌లో ధర చెబుతాడు. ఏకంగా ఒక్క అరటిపండే ధరే రూ. 100 పలుకుతుందని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు.

అయితే ఆ విదేశీయుడు హ్యూ. సరిగ్గా విన్నానా..? లేదా అని అయోమయానికి గురై మరొక్కసారి అడుగుతాడు. కానీ ఆ వ్యాపారి అనుమానం తలెత్తకుండా నమ్మేలా చెబుతున్న ఆ తీరుని చూసి కంగుతింటాడు ఆ విదేశీయుడు. సారీ తాను అంత ధర చెల్లించలేను అని చెప్పడమే గాక ఇలా అమ్మితే కచ్చితంగా మీరు నష్టపోతారని అంటాడు. 

ఆ తర్వాత తన బ్రిటన్‌ దేశంలోని అరటిపండ్ల ధరతో పోలస్తూ..భారత్‌లోని ఒక అరటిపండు ధరకు యూకేలో ఎనిమిది అరటిపండ్లను కొనుగోలు చేయవచ్చని అంటాడు. బహుశా ఇది విదేశీయుడికి మాత్రమే ఈ అమ్మకం ధర అని ఆ వీడియోలో చెబుతుండటం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం బ్రో ఇది ఫారెన్‌ టాక్స్‌, చెల్లించి భారత్‌ ఎకానమీని మార్చేందుకు తమరి వంతుగా సాయం చెయ్యొచ్చు కదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.  

(చదవండి: మాములు వెయిట్‌ లాస్‌ జర్నీ కాదు..! ఏకంగా 145 కిలోలు నుంచి..)
 

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)