Breaking News

ప్యారిస్‌ ఒలింపిక్స్‌ : రొమాంటిక్‌ లవ్‌ ప్రపోజల్‌, వైరల్‌ వీడియో

Published on Sat, 08/03/2024 - 13:21

సిటీ ఆఫ్‌ లవ్‌.. ప్యారిస్‌. తన ఇష్టసఖి మనసు గెల్చుకునేందుకు విశ్వక్రీడావేదికను ఎంచుకున్నాడు. ఈ రొమాంటిక్‌ స్టోరీ ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో  ఈ చైనీస్‌ జంట వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో చైనీస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హువాంగ్ యాకియోంగ్‌, జెంగ్ సివీ స్వర్ణం గెలిచి  తమ కలను సాకారం చేసుకున్నారు. కానీ బోయ్‌ ఫ్రెండ్‌ డైమండ్‌ రింగ్‌ను సొంతం చేసుకుంటానని ఊహించలేదు..హువాంగ్. స్టోరీ ఏంటంటే..:

తన లవ్‌ ప్రపోజల్‌కు ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది అనుకున్నాడో  ఏమో గానీ చైనీస్ షట్లర్ లియు యుచెన్, తన ప్రేయసి విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ మోకాళ్లపై  వంగి  ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ హువాంగ్ యాకియోంగ్‌కు డైమండ్‌ రింగ్‌తో ప్రపోజ్  చేశాడు.  దీంతో సిగ్గుల మొగ్గ అవ్వడం ఆమె వంతైంది. 

 సోషల్ మీడియాలో ఈ ప్రేమికులకు అభినందనలు వెల్లువెత్తాయి. లియు యుచెన్ ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలవలేదు కానీ ఒలింపిక్ బంగారు పతక విజేతను గెల్చుకున్నాడు అంటూ అభినందించారు. పురుషుల డబుల్స్‌లో టోక్యో-2020 రజత పతకాన్ని గెల్చుకున్నాడు లియు.

శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ బ్యాడ్మింటన్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వోన్ హో- జియోంగ్ నా-యూన్ (21-8, 21-11)పై చైనాకు చెందిన జెంగ్ సివీ మరియు హువాంగ్ యా కియోంగ్  స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు.

కాగా అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్‌ స్టార్ పాబ్లో సిమోనెట్‌, మహిళల ఫీల్డ్‌ హాకీ క్రీడాకారిణి మరియా పిలార్‌ కామ్‌పోయ్‌ లవ్‌ స్టోరీ కూడా ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో  వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆమెకు పెళ్లి ప్రతిపాదన తెచ్చేందుకు తొమ్మిదేళ్లు వెయిట్‌ చేసిన మరీ ఆమె మనసు దోచుకున్నాడు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)