Breaking News

వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే

Published on Wed, 10/23/2024 - 08:40

బంజారాహిల్స్‌: దేశం కాని దేశం.. ఊరు కాని ఊరు.. మన భాష అసలే తెలియదు.. మాట్లాడడానికి నోరు పెగలదు.. చెవులు వినబడవు.. అమెకున్న గ్రహణ శక్తి సంజ్ఞలు మాత్రమే. మూగ, చెవుడు అయినా కేవలం ఉపాధ్యాయులు చెప్పేది లిప్‌మూమెంట్‌ ద్వారా గ్రహిస్తూ చదువులో దూసుకుపోతోంది. క్లాస్‌లో ఎప్పుడూ మొదటి స్థానమే. నేపాల్‌కు చెందిన రియా (17) తల్లిదండ్రులు జయన్‌బహదూర్, తల్లి జోగుమాయలు పొట్ట చేతబట్టుకుని ఉపాధి నిమిత్తం 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. 

జయన్‌ బహదూర్‌ కుక్‌గా పనిచేస్తుండగా, భార్య మాయ గృహిణి. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. చిన్న కూతురు రియా పుట్టుకతో మూగ, చెవుడు. తన భావాలను పంచుకోవాలంటే మాటలు రావు, ఇతరులు చెప్పేది వినబడదు. అయితేనేం ఆమెకున్న గ్రహణ శక్తికి తనలోని లోపాలు కూడా చిన్నబోతాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–10లోని గాయత్రీహిల్స్‌లోని లిటిల్‌స్టార్‌ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది రియా.

ఎప్పుడూ ఫస్టే.. 
తరగతి గదిలో టీచర్లు చెప్పేది వినబడకపోయినా.. వారి లిప్‌మూమెంట్‌ ద్వారా ఆ పాఠాలు గ్రహిస్తోంది. ఏమైనా అర్థం కాకపోతే నోట్‌బుక్‌లో రాసి టీచర్లను అడుగుతుంది. నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఇక్కడే చదువుతున్న రియా ఎప్పుడూ క్లాస్‌ ఫస్టే వస్తుందని తెలుగు టీచర్‌ అనూష తెలిపారు. బ్లాక్‌బోర్డుపై తాము రాసే పాఠాల విషయాలు బాగా అబ్జర్వ్‌ చేస్తుందని హిందీ టీచర్‌ అర్షియా పరీ్వన్‌ తెలిపారు. ఈ బాలిక అంటే మొత్తం స్కూల్‌ విద్యార్థులకే కాకుండా టీచర్లకు కూడా ప్రత్యేక గౌరవం ఇస్తుంటారని ఆమె వెల్లడించారు.  

నూరు శాతం హాజరు.. 
వినబడదు..మాట్లాడలేదు..అయినా సరే ఏ ఒక్కరూ ఆమెను హేళనగా చూడరని, క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్‌ వస్తుంటుందని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అస్మతున్నీసా తెలిపారు. ఈ బాలిక అక్క, అన్న కూడా ఇదే పాఠశాలలో చదివారని తెలిపారు. రియాలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆమె వద్ద ఎలాంటి ఫీజూ తీసుకోకుండానే నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఉచితంగా చదువును అందిస్తున్నట్లు అస్మతున్నీసా పేర్కొన్నారు. కేవలం చదువులోనే కాకుండా పాఠశాలల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని అబ్బురపరిచే నృత్యాలు కూడా చేసి ఆకట్టుకుంటుంది. 

క్రాఫ్ట్‌వర్క్, డ్రాయింగ్, పోస్టర్‌ మేకింగ్, చార్ట్‌ తయారీలో కూడా రియా పాల్గొంటూ బహుమతులు సాధిస్తోంది. ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా స్కూల్‌ అటెండెన్స్‌లో 100 శాతంతో అందరి కంటే ముందుంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంతేకాదు తమ కంటే బాగా చదవడం, మార్కులు కూడా బాగా రావడం మమ్ముల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుందని సహచర విద్యారి్థని సౌమ్య చెబుతోంది.  

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)