Breaking News

రైజింగ్‌ స్టార్‌ సీత

Published on Sun, 10/20/2024 - 11:46

బాడీ షేమింగ్‌ని పట్టించుకోకుండా, ప్రతిభకు అందుతున్న ప్రశంసలకు పొంగిపోకుండా, విమర్శల తీరును గ్రహిస్తూ.. తన వ్యక్తిత్వానికి, టాలెంట్‌కి మెరుగులు దిద్దుకుంటూ సాగిపోతున్న నటి.. సీత! ఆమె పరిచయమే ఇది..

👉చెన్నైలో పుట్టి, పెరిగిన సీత.. ఆట, పాటల్లోనే కాదు చదువులోనూ చురుకే! తనను చూసి తనతో స్నేహం చేసిన వాళ్లకంటే వెక్కిరించే వాళ్లే ఎక్కువగా ఉండటంతో చిన్నప్పటి నుంచీ పెద్దగా ఫ్రెండ్స్‌ లేకుండా పోయారు. దాంతో మనోధైర్యమే ఆమెకు ఆప్తురాలైంది.

👉ఒకరోజు.. సీత తనకున్న అతికొద్ది మంది స్నేహితులతో కలిసి..  బీచ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుండగా, ఒకతను సీతను గమనించి, ఆమె దగ్గరకు వెళ్లి ‘నేను ఓ సినిమా తీస్తున్నాను. అందులో నటిస్తారా?’ అని అడిగాడు. అతనెవరో తనను ఆట పట్టిస్తున్నాడనుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆటపట్టించడం కాదు, నిజంగానే అతను సినిమా పర్సన్‌ అని సీతకు .. సినిమా సెట్స్‌ మీదకు వెళ్లాక తెలిసింది. అతనే.. విజయ్‌ మిల్టన్‌. ఆమె తొలిచిత్రం ‘గోలీ సోడా’ డైరెక్టర్‌.  

👉విజయం సాధించిన ‘గోలీ సోడా’.. అంతకుముందు కెమెరాను ఫేస్‌ చేసిన అనుభవమే లేని సీతకూ మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆమె ప్రతిభకు ముగ్ధుడైన విజయ్‌ మిల్టన్‌ తన తర్వాత సినిమా ‘10 ఎండ్రాతుకుళ్లా’లోనూ  అవకాశం ఇచ్చాడు.  అలా ప్రభుదేవా నటించిన ‘చార్లీ చాప్లిన్‌’ తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించింది.  

👉 వెండితెర అవకాశాల్ని అందించిన పాత్రే నన్ను వెబ్‌ ప్రపంచానికీ పరిచయం చేయడం సంతోషం. నిజానికి ఆ రోల్‌.. నా లైఫ్‌ని రిఫ్లెక్ట్‌ చేస్తున్నట్టు ఉంటుంది. నా ఫిజికల్‌ అపియరెన్స్‌ గురించి ఎవరేం కామెంట్‌ చేసినా పట్టించుకోను. 
నా  పని నేను చేసుకుంటూ పోతా!

👉‘గోలీ సోడా’కు సీక్వెల్‌గా తీసిన ‘గోలీ సోడా – ద రైజింగ్‌ ’ వెబ్‌సిరీస్‌తో సీత ఓటీటీలోకీ ఎంటర్‌ అయింది. ఇది డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.  


– సీత.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)