Breaking News

రెట్రో టు మెట్రో..! సరికొత్త స్టైల్‌కి ఐకానిక్‌గా..

Published on Fri, 02/28/2025 - 10:49

పాల మీగడను తలపించే లేత పసుపు రంగువసంతకాలాన్ని మరింత కళగా మార్చేస్తుంది. కాంతిమంతమైన రంగులను వెనక్కి నెట్టేస్తూ ఇండో– వెస్ట్రన్‌ స్టైల్‌ అయినా, సంప్రదాయ వేషధారణ అయినా ఈ స్ప్రింగ్‌ సీజన్‌లో బటర్‌ ఎల్లో స్పెషల్‌ మార్క్‌ వేస్తోంది.. పాజిటివ్‌ ఎనర్జీని చుట్టూ నింపడంలోనూ ప్రకృతిలో కొలువుండే ఆహ్లాదాన్ని కళ్లకు కడుతూ మదిని దోచేస్తోంది. రెట్రో స్టైల్‌కి సరైన ఎంపికగా నిలుస్తోంది. కార్పోరేట్‌ సంస్కృతికి కొత్త అర్ధం చెబుతూ మెట్రో స్టైల్‌తో బెస్ట్‌ మార్కులు కొట్టేస్తుంది.

ఈ వసంత కాలంలోనే కాదు రాబోయే వేసవిలోనూ హాయిగొలిపే రంగుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది బటర్‌ ఎల్లో. ఈ లేత పసుపు రంగు షేడ్స్‌ సంప్రదాయ క్లాసిక్‌ వేర్‌లోనే కాదు బోల్డ్‌ కాంట్రాస్ట్‌ కలర్స్‌తోనూ జత కలుస్తుంది. మృదువైన, ప్రకాశవంతమైన రంగుల ఎంపికలో బటర్‌ ఎల్లో ముందువరసలో ఉంది. 

లాంగ్‌ గౌన్లు, స్టైలిష్‌ కార్పొరేట్‌ వేర్‌గానే కాదు ఫ్యాషన్‌ వేదికలపైనా లేత పసుపు రంగు తనదైన ముద్ర వేస్తోంది. చందేరీ, షిఫాన్, జార్జెట్‌ ఫ్యాబ్రిక్‌లలో బటర్‌ ఎల్లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటే కాటన్, పట్టులలో రిచ్‌ లుక్‌తో అబ్బురపరుస్తుంది. 

కాంట్రాస్ట్‌ కలర్‌ ఆలోచనకు ఈ షేడ్‌ను దూరంగా పెట్టవచ్చు. సేమ్‌కలర్‌ ఎంబ్రాయిడరీ వర్క్, ఫ్లోరల్‌ ప్రింట్స్‌లో తెలుపు, గాఢమైన పసుపు రంగు మోటిఫ్స్, పోల్కా డాట్స్‌ బటర్‌ ఎల్లోను మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి. 

ఇటీవల బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌ ముంబైలోని ఫ్యాషన్‌ ఈవెంట్‌ బీవోఎఫ్‌ గాలాలో  డిజైనర్‌ జార్జ్‌ స్టావ్‌పోలోస్‌ రూపొదించిన లేత పసుపు షిఫాన్‌ గౌను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఈ లుక్‌ 1970ల నాటి వింటేజ్‌ గ్లామర్‌ను తన డ్రెస్సింగ్‌ ద్వారా చూపింది.. ప్రాచీన అందాన్ని ఆధునికతతో మేళవించినట్టుగా తన డ్రెస్సింగ్‌ ద్వారా చూపుతూ ఈ సీజన్‌కు తప్పనిసరిగా ఉండవలసిన బటర్‌ ఎల్లో ప్రాముఖ్యతను చాటింది. 

(చదవండి:  పువ్వులు పంచే అందం..!)

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)