Breaking News

కూరగాయల షాపింగ్‌ గైడ్‌!

Published on Mon, 09/16/2024 - 07:56

కూరగాయాలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కి వెళ్లిన ప్రతిసారి  పాడయినవే పొరపాటున కొనేస్తాం. ఎన్నాళ్లు కొన్నా కూడా ఏదో ఓ కూరగాయ వద్ద అంచనా తప్పి మంచివి కొనలేకపోతుంటాం. అలాంటప్పుడూ ఎలాంటి కూరగాయాలు కొంటే మంచిది అనేది ఎవరైనా పెద్దవాళ్ల సలహాతో ప్రయత్నించి చూస్తాం కదా..!. చాలామంది అందుకు ఓ కచ్చితమైన గైడ్‌ ఉంటే బాగుండును అని ఫీలవుతుంటారు. ప్రస్తుతం అలాంటి సలహాలు సూచనలతో కూడిన కూరగాయల షాపింగ్‌ గైడ్‌ ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

మార్కెట్‌లో కూరగాయాలను కొనేముందు ఇలాంటి సూచనలు, సలహాలు పాటించండి అంటూ ఓ కూరగాయల షాపింగ్‌ గైడ్‌ నెటింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. అందులో టమోటాలు పసుపు ఎరుపు రంగులో కాస్త ఓ మోస్తారు పచ్చిగా ఉన్నవి తీసుకుంటే ఎక్కువకాలం వాడుకోవచ్చు. రంధ్రాలు పడిన టమోటాలు ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చెయ్యొద్దు. బంగాళదుంపలు గట్టిగా ఉంటేనే తీసుకోవాలి. కాస్త మెత్తగా ఎక్కడైన తగిలితే దాన్ని ఎంపిక చేసుకోకూడదు. అలాగే మెంతి ఆకులు తాజాగా కనిపిస్తేనే కొనాలి. అలాగే బచ్చలి, ఉల్లపాయలు, పచ్చిమిర్చి వంటివి.. ఎలాంటి కొంటే మంచిది అనేది.. ఆ గైడ్‌లో చాలా విపులంగా వివరించి ఉంది. 

ఓ రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ తన భార్య స్వయంగా చేతులతో రాసిన.. ఎలాంటి కూరగాయలు కొనాలనే షాపింగ్‌ గైడ్‌ని నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. తాను కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్తున్నపుడు ఉపయోగ పడుతుందంటూ.. ఈ చీటి తన చేతిలో పెట్టినట్లు చెప్పుకొచ్చారు. నెటిజన్లు వావ్‌ కూరగాయలు కొనుగోలు మార్గదర్శిని అంటూ అతడి భార్యపై ప్రశంసలు కురిపించారు. అలాగే పండ్ల గైడ్‌ కడా ఇస్తే బాగండు అంటూ పోస్టులు పెట్టారు. కొత్తగా మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్లకు ఈ గైడ్‌ చక్కగా ఉపయోగపడుతుంది కదూ..!.

 

(చదవండి: ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్‌ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!)
 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)